అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ గుర్తుంచుకోవాలి: అనిల్‌

తాడేపల్లి: తనకు ఓట్లేశారని తమ సామాజక వర్గంపై దాడులు చేశారని.. అది ప్రజాస్వామ్యంలో మంచిదికాదని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు.

ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్తయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్న 40 శాతం ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్తకాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలపడ్డాం. ఇప్పూడూ అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నాం” అని అనిల్‌ చెప్పారు.

”ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్‌ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం చూస్తున్నారు. అధికార పార్టీకి కాస్త టైం ఇస్తాం. వారి తప్పులపై నిలదీస్తాం” అని అనిల్‌ పేర్కొన్నారు.

”తమిళనాడులో డీఎంకేకి నాలుగుసార్లు డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా అంతే. రాజకీయ సన్యాసంపై నా ఛాలెంజ్‌ని టీడీపీ వారు స్వీకరించలేదు. కాబట్టి దాని గురించి ఇక నేను మాట్లడను. దాడుల్లో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. కక్ష సాధింపు ఉండదని చెప్తూనే టీడీపీ దాడులు చేస్తోంది. ఇది మంచి పద్దతి కాదు’ అని అనిల్‌ పేర్కొన్నారు.

About amaravatinews

Check Also

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *