నయన్‌కి శ్రుతి, అనుపమ, చిన్మయి మద్దతు.. ధనుష్ ఫ్యాన్స్ వాదన ఇదే

నిర్మాత అయిన ధనుష్ నేను రౌడీనే సినిమాలోని క్లిప్స్‌ను, లిరిక్స్‌ను వాడుకునేందుకు అనుమతించలేదని, అందుకే తమ కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్లను ఓ మూడు సెకన్ల పాటు మేం వాడుకున్నందుకు పది కోట్లు చెల్లించమని లీగల్ నోటీసులు పంపించాడంటూ నయన్ మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే ధనుష్ నయన్ వివాదంలో ఎవరి కోణం వారికి ఉంది. నయన్‌కు మద్దతుగా తారలు నిలుస్తున్నారు. నయన్ పోస్టుని చిన్మయి, శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, లక్ష్మీ మీనన్ వంటి వారంతా కూడా లైక్స్ కొట్టి సపోర్ట్ చేశారు.

నయన్ అభిమానులు కూడా ధనుష్‌ను విమర్శిస్తున్నారు. కానీ ధనుష్ అభిమానుల వాదన కూడా నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. నేను రౌడీనే సెట్‌లో, షూటింగ్ టైంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా అని అంటున్నారు. ఆ టైంలో నయన్ విఘ్నేశ్‌లు ప్రేమలో పడ్డారు. షూటింగ్‌ను గాలికి వదిలేశారు. చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. అలా ఆరు కోట్ల బడ్జెట్‌ను పదహారు కోట్ల వరకు చేశారు. నిర్మాతగా ధనుష్‌కు భారీ నష్టం వాటిల్లింది. నిర్మాతగా ధనుష్‌కు సినిమా మీద అన్ని హక్కులు ఉంటాయి.. నువ్వు మాత్రం నెట్ ఫ్లిక్స్‌కి ఫ్రీగా డాక్యుమెంటరీని చేశావా? నువ్వు డబ్బులు తీసుకున్నావ్ కదా? నీ పెళ్లి వీడియోల్ని కూడా అమ్ముకున్నావ్ కదా? ఇప్పుడు ధనుష్ నీకు నోటీసులు పంపితే తప్పు ఏంటి? అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.

ఇలా ధనుష్, నయన్ వివాదంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ ధనుష్‌ వ్యక్తిత్వాన్ని నయన్ బట్టబయలు చేసింది. నీలో ఉంత ద్వేషం, కుళ్లు ఉందా? కేవలం మంచి మాటలే చెబుతావ్.. చేసే పనులన్నీ మాత్రం ఇలా ఉంటాయ్ అంటూ ఇలా దారుణంగా ధనుష్‌ను విమర్శించింది. మరి వీటికి ధనుష్ సమాధానం చెబుతాడా? ఈ వివాదానికి అగ్గిలో ఆజ్యం పోస్తాడా? లేదంటే లైట్ తీసుకుని తన పని ఏదో తాను చేసుకుంటూ పోతాడా? అన్నది చూడాలి. ఏది ఏమైనా నయన్ లేఖ మాత్రం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఎంతైనా ఇళయారాజా బయోపిక్ చేస్తున్నాడు.. కారెక్టర్లో జీవించాలి కదా.. అందుకే ఇలా లీగల్ నోటీసులు పంపించాడేమో అని కొందరు నవ్వుకుంటున్నారు.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *