3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీలో మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు సమర్ధవంతంగా ఎదుర్కొలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొడుతోందన్న ముఖ్యమంత్రి.. వాటిని మంత్రులు ఎందుకు తిప్పకొట్టడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పడు వివరించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రభావం మంత్రులపై వెంటనే పనిచేసినట్టు కనిపిస్తోంది. మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసిన నలుగురు మంత్రులు కేబినెట్‌ నిర్ణయాలతో వైసీపీ చేసిన పలు ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు.

టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేత భూమనపై కేసు పెడతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అబద్ధాన్ని నిజం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో మతకలహాలకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్రంలో ఐటీ సంస్థలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో TCS సహా పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్ట్‌తో పాటు పలు నిర్మాణాలకు కేబినెట్‌ ఓకే చెప్పింది. గుంటూరులో ESI ఆస్పత్రి, కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. అనారోగ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు కాగా సమాచార శాఖా మంత్రి పార్థసారథి వ్యక్తిగతకారణలతో ముఖ్యమంత్రి అనుమతి తో హాజరు కాలేదు.  ఇక ఏపీ కేబినెట్ 24 అంశాల అజెండాపై చర్చించి ఆమోదం తెలిపింది.

కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవేః

1. ఎస్సీ ఉపవర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ ముసాయిదా ఆమోదం

2. 10.04.2025న జరిగిన SIPB సమావేశం నిర్ణయాలకు ఆమోదం.

3. ఏడు జిల్లాలలో సీనరేజ్ ఫీజు సేకరణ కాంట్రాక్ట్‌ల కాలం పొడిగింపు

4. పరిశ్రమల శాఖలో GO.Ms.No.49, 50, 51కి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల ర్యాటిఫికేషన్

5. టీసీఎస్‌కి విశాఖ IT హిల్ 3లో 21.16 ఎకరాల భూమి కేటాయింపు – 1,370 కోట్లు పెట్టుబడి, 12,000 ఉద్యోగ అవకాశాలు.

6. URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి భూముల కేటాయింపు, హిల్ 3 (SEZ)లో 3.5 ఎకరాలు, కపులుప్పాడలో 56.36 ఎకరాలు.

7. అమరావతిలో శాసనసభ భవనం, హైకోర్టు భవనం నిర్మాణానికి L1 బిడ్స్ ఆమోదం.

8. ప్రధాన నగరాల్లో వాతావరణ చర్యల అమలుకు రాష్ట్ర క్లైమేట్ సెంటర్ (S-C3) ఏర్పాటు ప్రతిపాదన.

9. APCPDCL పరిధిలోని మిగిలిన 199 వ్యవసాయ ఫీడర్ల విభజన పనులకు DPRల ఆమోదం.

10. బలిమెల, జలపుట డ్యామ్ పవర్ ప్రాజెక్టులను OPCLకి కేటాయింపు. 50% పవర్ APకి సరఫరా చేసే విధంగా ఒప్పందం.

11. కర్నూలు జిల్లా ఆస్పరిలో 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు JSW Neo Energy Ltd అనుమతి.

12. విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కు 3 సౌర ప్రాజెక్టుల (270MW x 3) కోసం అనుమతి.

13. చింతా గ్రీన్ ఎనర్జీ కి 2000 MW AC ప్రాజెక్టుకు అనుమతి.

14. చింతా గ్రీన్ ఎనర్జీ సంస్థకు– 700 MW AC / 875 MWp ప్రాజెక్టుకు కూడా అనుమతి.

15. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ESIC హాస్పిటల్ నిర్మాణానికి భూమిని ఉచితంగా కేటాయింపు.

16. ఎలూరు జిల్లాలో దేవాదాయ శాఖకు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధికి భూమి కేటాయింపు.

17. చిత్తూరు జిల్లా కుప్పంలో కేంద్ర విద్యాలయ స్థాపన కోసం ప్రభుత్వ భూమి- ప్రైవేట్ భూమి మార్పిడి.

18. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో APIICకి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కేటాయింపు.

19. అదే మండలంలోని మరో 220 ఎకరాలు APIICకి ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయింపు.

20. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి భూమి కేటాయింపు.

21. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాల్వ ప్రాజెక్టు మోడరనైజేషన్ పనులకు ఆమోదం.

22. వెలిగొండ ప్రాజెక్ట్‌లో కీలక పనులకు రూ.106.39 కోట్లు వినియోగానికి పరిపాలనా అనుమతి.

23. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులకు నవయుగ సంస్థకు రూ.93.93 కోట్లు చెల్లింపు ఆమోదం.

24. డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వీడియోగ్రాఫర్ పోస్టును ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నెలకు రూ.60,000తో నియామకం.

About Kadam

Check Also

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి, కుటుంబంలో విషాదం

కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురం కు చెందిన మూడు కుటుంబాలపై పెహల్గాం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *