సినీనటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు రాగా.. తాజాగా పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కీసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారన్న వంశీకృష్ణ.. వర్గాల మధ్య విబేధాలు తలెత్తేలా ఆయన మాటలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణ మురళిపై సీఐడీ అధికారులు 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది.
Check Also
కొమురంభీమ్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి
అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ …