ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్‌ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.

కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేజ్రీవాల్ హయాంలోని ఢిల్లీ మోడల్ ఒక ఫెయిల్యూర్ మోడల్‌గా అభివర్ణించారు చంద్రబాబు. మౌలిక వసతుల గురించి పట్టించుకోకుండా ఢిల్లీని చెత్త నగరంగా మార్చేశారన్నారు. ఏపీలోని లిక్కర్ కుంభకోణం ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని అన్నారు చంద్రబాబు. వైసీపీ హయాంలో నాణ్యమైన లిక్కర్ సరఫరా చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయన్నారు చంద్రబాబు. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్‌ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.

ఢిల్లీలో ఎన్డీఏ విజయం చరిత్రాత్మకమన్న సీఎం చంద్రబాబు.. వాయు కాలుష్యంతో పాటు.. రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ వాతావరణం చెడిపోయిందన్నారు. చాలా మంది ఇతర నగరాలకు వెళ్లిపోయారు.. మోదీపై నమ్మకంతోనే బీజేపీని గెలిపించారన్నారు. కొందరు సంక్షేమం పేరుతో అవినీతి చేశారని.. ఏపీకి ఢిల్లీకి చాలా పోలికలు ఉన్నాయని.. బటన్‌ నొక్కే మోడల్‌ ఢిల్లీలోనూ విఫలమయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చంద్రబాబు చెప్పారు.

ఎమ్మెల్యేకి సరిపోయే ఓట్లు వస్తే ఎమ్మెల్యేనే..

మోదీ మోడల్ బాగుంది కాబట్టే గుజరాత్‌లో ఐదుసార్లు గెలిచారని.. అలా సుస్థిరత అభివృద్ధికి ఏ నాయకుడైనా ప్రయత్నించాలని చంద్రబాబు చెప్పారు. అలాకాకుండా 2.O అని మాట్లాడితే అదొక మానసిక హింస అవుతుందన్నారు. మళ్లీ వాళ్లొస్తారనే మానసిక వేదన ప్రజలకు ఉండకూడదంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేకి సరిపోయే ఓట్లు వస్తే ఎమ్మెల్యేనే.. ప్రతిపక్షహోదా కావాలంటే 10% సీట్లు దక్కాల్సిందే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

About Kadam

Check Also

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *