శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టుతూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటికే ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా, ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ కీలక భూమిక పోషించనున్నాయి.

ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ ఎలా పనిచేయబోతున్నాయి

ఈ కౌంటర్ యాక్షన్ బృందంలో ఆరుగురు ప్రత్యేకంగా ప్రధాని భద్రతను పర్యవేక్షించే SPG ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కమాండోలు ఉంటారు. వీరి ప్రధాన బాధ్యత – ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి ఆయనపై బయటి నుంచి దాడి చేసే అవకాశం ఉన్న వ్యక్తులపై ఎప్పటికప్పుడు డేగ కన్నుతో పర్యవేక్షిస్తుంటారు.

సీఎం భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం

ఈ ఆరుగురు సభ్యుల బృందానికి SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.. అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఈ బృందం మరింత సమర్థంగా పనిచేయగలగడం ఈ టీమ్ లక్ష్యం.

సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా..

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలలో ఉండేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రి కి కాస్త దూరంగా ప్రజల్లోనే ఉంటూ బయట నుంచి దాడి చేసే వ్యక్తుల పై దృష్టి సారిస్తారు. నాలుగో అంచలో పనిచేసే ఈ భద్రతా వ్యవస్థ బయట నుంచి దాడి చేసే వారిని గుర్తించి వారిని అటునుంచి అటే బయటకు తీసుకెళ్తుంది. మొదటి మూడు అంచెలలో ఉండే NSG, SSG, స్థానిక సాయుధ పోలీసులు పూర్తిగా చంద్రబాబు పైనే దృష్టి ఉంచి ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంటాయి.

ఈ మార్పులు ప్రజలకు సీఎం భద్రత ఎంత ముఖ్యమో తెలపడం మాత్రమే కాకుండా, భద్రతా వ్యవస్థలో సమన్వయం, నాణ్యతను పెంపొందించడంలో దోహదపడతాయని ముఖ్యమంత్రి భద్రతా విభాగం భావిస్తోంది.

About Kadam

Check Also

నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!

తెలుగు రాషాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేసు ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తుంటే.. మరోవైపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *