పేరు కోసం ప్రయత్నించడమే ఆ రెండుసార్లు ఓడిపోయా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తాను పేరు కోసం ప్రయత్నించి ఓడిపోయానని, అందరూ నన్ను ఆహా ఓహో అని పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని భ్రమపడి.. ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ పత్రిక వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి తాను పేరు కోసం ప్రయత్నించడమే కారణమని చెప్పారు. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని భావించానని, దానివల్ల ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టానని అన్నారు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలా చేయకుండా ప్రజలను ఎప్పుడూ తనవెంట తీసుకెళుతూ పనిచేస్తున్నారని చెప్పారు.

‘‘నేను తొలిసారి 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను.. దీనికి నాలుగేళ్ల ముందు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 90వ దశకం తొలినాళ్లలో ఇంటర్‌నెట్‌ విప్లవం మొదలైంది.. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరచడానికి నేను వాటన్నింటినీ ఉపయోగించడం మొదలుపెట్టాను. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయానికి పలు ఆర్థిక, ఇతర సమస్యలు ఉన్నాయి.. అప్పుడు ప్రజలతో నేరుగా మాట్లాడి వారిని చైతన్యపరిచేందుకు ప్రయత్నించాను.. కొత్త విధానాలు అవలంభించడంతో పాటు వాటి ప్రభావం గురించి నిరంతరం ప్రజలకు వివరించాను.. విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడంతో ల్ల 1999లో వరసగా రెండోసారి విజయం సాధించాను..

నేను పేరు కోసం ప్రయత్నించినప్పుడు ఓడిపోయాను.. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని అనుకొనేవాడ్ని. దానివల్ల ప్రజలను వదిలి ముందుకెళ్లడం మొదలుపెట్టాను. ప్రధాని మోదీ అలా చేయకుండా ఎప్పుడూ తనవెంట ప్రజలను తీసుకెళుతూ పనిచేస్తున్నారు. 2004, 2019ల్లో నేను అది విస్మరించాను.. అలా చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండి అభివృద్ధి కొనసాగేది. కానీ ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నా. ప్రజలను నా వెంట తీసుకెళ్తూ అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తే ప్రజాక్షేత్రంల ఉత్తమ పనులు చేయగలనని భావిస్తున్నా. ఇప్పుడు అదే చేస్తా’ అని అని చంద్రబాబు అన్నారు.

About amaravatinews

Check Also

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *