హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ రియాక్షన్ ఇదే..

తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించిన విజయ్.. ఆదివారం టీవీకే మహానాడును నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన టీవీకే పార్టీ మొదటి మహానాడుకు అశేష జనవాహిణి హాజరైంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తమ పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి రావటానికి కారణాలను విజయ్ వెల్లడించారు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విజయ్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో పవన్ కింగ్ మేకర్‌గా మారినట్లు.. తమిళనాట విజయ్ తన మార్క్ చూపిస్తారా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే విజయ్ రాజకీయ ప్రవేశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఎంతో మంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే విజయ్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం అనంతరం అప్పట్లో.. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్‌ను విజయ్ అభినందించిన సంగతి తెలిసిందే. ఇక టీవీకే పార్టీ అవిర్భావ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా విజయ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఆదివారం టీవీకే మహానాడులో ప్రసంగించిన విజయ్.. తన పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని.. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలమని ప్రకటించారు. పెరియార్‌ ఈవీ రామస్వామి, కె.కామరాజ్‌, అంబేడ్కర్‌ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. సినిమా రంగంలో కెరీర్ అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడే వదిలేసి మీ అందరిపై నమ్మకంతో వచ్చానని చెప్పుకొచ్చారు. రాజకీయ తనకు అనుభవం లేదని కొంతమంది అంటున్నారన్న విజయ్.. రాజకీయం అనే విషనాగుతో ఆడుకునే పిల్లలమంటూ సెటైర్లు వేశారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *