డిప్యూటీ సీఎం ఆదేశాలు.. కాకినాడలో ఆ చెట్టు కనిపిస్తే చాలు ఖతమే..

కాకినాడ జిల్లాలో ఆ మొక్క కనిపిస్తే చాలు.. అధికారులు కస్సుమంటున్నారు. కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తున్నారు. ఏంటా.. ఎందుకా కోపం అనుకుంటున్నారా.. ఆ మొక్క వలన సమాజానికి కీడే తప్ప మేలు లేదనే ఉపయోగంతో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో కోనోకార్పస్ చెట్లను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 35 వేలకు పైగా ఈ కోనో కార్పస్ చెట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అటవీశాఖ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

మరోవైపు కోనో కార్పస్ చెట్లు హానికరం అని తెలిసి వాటినివెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తీసివేయాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ చెట్లతో తనకు ఉన్న అనుభవాన్ని కూడా పవన్ పంచుకున్నారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానన్న పవన్ కళ్యాణ్.. అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తీసివేసినట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలో ఉన్న ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని.. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పవన్ ఆదేశాలతో అధికారులు కోనో కార్పస్ చెట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.

మరోవైపు కోనో కార్పస్ చెట్లు పచ్చగా, ఏపుగా పెరుగుతాయి. అందుకే వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే రోడ్డు డివైడర్ల మధ్యన, నర్సరీల్లో వీటిని పెంచుతుంటారు. అయితే ఈ చెట్లు చాలా హానికరమైన నిపుణులు చెప్తున్నారు. కోనో కార్పస్ చెట్ల కారణంగా శ్వాసకోస సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే భూమిలోని నీటిని కూడా ఈ చెట్టు తోడేస్తుందని.. దీని వేర్లు 80 మీటర్ల వరకూ భూమిలోకి వెళ్లి నీళ్లను తాగేస్తుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఈ చెట్ల పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లో వీటిని ఇప్పటికే నిషేధించారు.

About amaravatinews

Check Also

ఆహ ఏం రుచి.! అన్నప్రసాదంలో మరో ఐటెమ్.. శ్రీవారి భక్తులకు పండుగే పండుగ

తిరుమల శ్రీనివాసుడంటే ప్రపంచమంతా ఫేమస్సే.. అందుకే ఆయన దర్శనం కోసం ప్రపంచం నలుమూలలనుంచి రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. ఒక్క శ్రీవారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *