పులులను వేటాడితే తాట తీస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని.. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుందని పవన్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నల్లమలలో టైగర్ ట్రాకర్స్‌గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal