ఏపీలో వారందరికీ శుభవార్త.. ఉచితంగా ట్రైనింగ్.. ప్రతినెలా రూ.1500..

డీఎస్సీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా స్టైఫండ్ కూడా అందివ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణ శనివారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తోంది. మరోవైపు బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ ఉచిత కోచింగ్ తీసుకునేవారికి కోచింగ్ సమయంలో నెలకు రూ.1500 స్టైఫండ్ కింద ఇవ్వనున్నారు. అలాగే మెటీరియల్ కోసం రూ.1000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందివ్వనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీని ప్రకటించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పించడం కోసం బీసీ సంక్షేమశాఖ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సబ్జెక్టుల వారీగా నిష్ణాతులైన అధ్యాపకులతో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో బీసీలకు 66 శాతం, ఎస్సీ అభ్యర్థులకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పదిశాతం సీట్లు కేటాయించారు. ఒక్కో కోచింగ్ సెంటర్లో 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా 5,200 మందికి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రెండు నెలల పాటు ఈ ఫ్రీకోచింగ్ ఇవ్వనున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌లోనూ డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం అవకాశం లభించని అభ్యర్థులకు ఆన్ లైన్ లోనూ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ తీసుకువస్తున్నారు. దీని ద్వారా సబ్జెక్టుల వారీగా నిపుణులతో తరగతులు నిర్వహిస్తారు. అలాగే పాత క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే బీఈడీతో పాటుగా టెట్ పాసైన వారికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ అవకాశం ఉంటుంది.

About amaravatinews

Check Also

హిజ్రాలతో సన్నిహితంగా కుమారుడు.. తల కొట్టేసినట్లు అనిపించడంతో.. అతని పేరెంట్స్..

ఒక్కడే కొడుకు.. ఆస్తులు లేకున్నా.. రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును బీటెక్ చదివించారు. అయితే అతను మాత్రం తప్పుడు మార్గంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *