ఏపీలో స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్.. ఉచితంగా కిట్లు, డబ్బులు కూడా ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఈ పథకం కింద కిట్లు అందించేందుకు రూ. 953.71 కోట్ల వ్యయంకానుంది. ఈ నిధుల్లో కేంద్రం రూ. 175.03 కోట్లు.. రాష్ట్రం రూ. 778.68 కోట్లు కేటాయించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే 35,94,774 మంది విద్యార్థులకు కిట్లు అందజేస్తారు.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద.. పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫామ్ అందిస్తారు. ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్టు ఇవ్వడానికి రూ. 1858.50 వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే యూనిఫామ్‌కు సంబంధించి కుట్టుకూలి కింద 1-8 తరగతులకు రూ. 120.. 9, 10 తరగతుల వారికి రూ. 240 చెల్లించనుంది ప్రభుత్వం. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కిట్‌ను విద్యార్థులకు అందించనుంది.

గత ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు అందజేసిన కిట్లలో బ్యాగ్‌లు నాణ్యతా లోపం కారణంగా చిరిగిపోయాయనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు బ్యాగ్‌లు, బెల్టులపై పార్టీ రంగులు వేసుకుందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఏడాది గత ప్రభుత్వ హయాంలో కిట్లనే స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేసింది. ఈసారి ఆ పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, బూట్లు, కిట్‌లోని వస్తువులపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి విద్యాకానుక కింద అందించే కిట్లను టెండర్లు లేకుండా కొనుగోలు చేసిన అంశంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఇకపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్కూల్ విద్యార్థులకు కిట్‌లు అందజేస్తామన్నారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *