ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కల సాకారం కావడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి మరువలేనిదన్న మంత్రి.. వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని అభిప్రాయపడ్డారు. అందుకే వారి పాదాలను కడిగి సన్మానించుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు. కార్మికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Check Also
రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?
సోషల్ మీడియా సైకోలకు కళ్లేం వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసభ్యకర పోస్టులు పెట్టే వారి బెండు …