సీఎం చంద్రబాబును ఆ ఒక్క విషయంలో స్వాగతిస్తున్నాం: వైఎస్ షర్మిల

ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు గాలికి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. వాటి స్థానంలో కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇటీవల జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో సూపర్ సిక్స్‌లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారని అనుకున్నామని చెప్పారు. మహిళలకు శుభవార్త చెబుతారనుకుంటే.. మెుండి చేయి చూపారని ఫైరయ్యారు.

‘రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తాం అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. జాబ్ ఫస్ట్ అనే నినాదం అని బాబు చెప్పాడు. ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే.. ఇవన్నీ అమలు చేసే చిత్తశుద్ది బాబుకి ఉందా? 2014లో పెద్ద పెద్ద పథకాలు అన్నాడు. అమరావతిని సింగపూర్ అన్నాడు. 3D గ్రాఫిక్స్ చూపించాడు. అప్పుడు చెప్పిన వాటికి.. ఇప్పుడు చెప్పిన వాటికి తేడా లేదు. పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టాడు బాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లుంది అనిపించింది.

పాత గిఫ్ట్ కొత్త బాక్స్‌లో ఇస్తున్నాడు. ఇవి అమలు అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కాకపోతే చంద్రబాబును ఒక్క విషయంలో స్వాగతిస్తున్నాం. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే. రాష్ట్రంలో నిరుద్యోగం తారా స్థాయిలో ఉంది. ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. గత 10 ఏళ్లుగా పరిశ్రమలు లేక యువత వలసలు వెళ్ళింది. రాష్ట్రానికి నిరుద్యోగం అతి పెద్ద సమస్య. నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి?

About amaravatinews

Check Also

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *