స్వర్ణాంద్ర ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం

APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

మొత్తం పోస్టులు : 13

  • ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్ పోస్టులు : 04
  • కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్‌ పోస్టులు : 08
  • డేటాబేస్ డెవలపర్ పోస్టులు : 01
  • ఇతర ముఖ్య సమాచారం :
  • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • జీతం: నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు.. కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 – రూ.1.50,000.. డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 – రూ.75,000 వేతనం ఉంటుంది.
  • వయోపరిమితి: 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు.. కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు,, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
  • పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2024

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *