ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరారు.. ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని.. తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దాడి ఘటన స్థానికంగా కలకలంరేపింది.
మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడులో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని.. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేపై ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు.
మరోవైపు పోలవరం జనసేన ;ekhzw ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తనిఖీకి వెళ్ళారు. ఆఫీసు సమయంలో ఉద్యోగి సాయి కుమార్ పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉద్యోగులు
ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాల రాజు బుట్టాయిగూడెం మండలం రాజానగరంలో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పదవ తరగతి క్లాస్ విద్యార్థులతో పాటు పాఠాలు విన్నారు. అలాగే హాస్టల్ భవనం, మెస్‌ను తనిఖీ చేశారు.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్‌లో మెస్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని కోరారు. ఆ తర్వాత టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీలో ఉన్న PHCని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. గత ప్రభుత్వంలో PHC నూతన భవనం కొరకు కొంత నిధులు కేటాయించి కనీసం బేస్మెంట్ కూడా నోచుకోలేదని.. దోపిడీ ఎక్కువైందన్నారు. సుమారుగా 2.5 కోట్లు అవినీతి జరిగిందని మండిపడ్డారు. మొత్తానికి పోలవరం ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమస్యలపై ఫోకస్ పెట్టారు.