ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్ర సమస్యలను సీఎం కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపిపారు. అంతే కాకుండా మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షా కు, కేంద్రానికి, ప్రధానికి …
Read More »ఆ రంగాల్లో నాలుగేళ్లలో 10లక్షల ఉద్యోగాల టార్గెట్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు!
ఏపీలో రాబోయే నాలుగేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ – జిసిసి ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి …
Read More »ఆయన 17 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు.. ఇప్పుడు కొందరు హిందీ ఎందుకంటున్నారు- సీఎం చంద్రబాబు
దేశానికి అనేక రంగాల్లో సేవలందించిన మహానీయుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సేవలు మరవలేనివన్నారు. 17 భాషలు నేర్చుకున్న పీవీ.. ఎన్నో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. ప్రధానిగా, కేంద్రమంత్రిగా, సీఎంగా ఆయన దేశానికి ఎన్నో సేవలందించారని గుర్తుచేశారు. ఢిల్లీ జరిగిన లెక్చర్ సిరీస్ ఆరో ఎడిషన్ కార్యక్రంలో లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ అంశంపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ …
Read More »శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నెల ఆర్జిత సేవా కోటా రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.. ఇవే పూర్తి వివరాలు!
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల …
Read More »జామపండ్లు మీకూ ఇష్టమా? జాగ్రత్త.. వీరికి విషంతో సమానం
కొద్దిగా వగరు, మరికాస్త పులుపు, ఇంకాస్త తీపి.. రుచులతో జామ పండ్లు తినేందుకు భలేగా ఉంటాయి. జూలై మొదలు సెప్టెంబర్ వరకు మార్కెట్లలో జామపండ్లు దర్శనమిస్తాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దాని ఆరోగ్య ప్రయోజనాలు, సరసమైన ధర కారణంగా.. జామపండ్ల సీజన్ వచ్చేసింది. కొద్దిగా వగరు, మరికాస్త పులుపు, ఇంకాస్త తీపి.. రుచులతో జామ పండ్లు తినేందుకు భలేగా ఉంటాయి. జూలై మొదలు సెప్టెంబర్ వరకు మార్కెట్లలో జామపండ్లు దర్శనమిస్తాయి. …
Read More »భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య.. మరో ముగ్గురికి..
భార్యాభర్తల మధ్య గోడవల కారణంగా గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. దీనికోసం పెద్దపల్లి జిల్లా, మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరుపువారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరుపువారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశమయ్యారు. పంచాయతీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల పంచాయతీ వివాదం రెండు హత్యలకు దారితీసింది. మాట్లాడుకుందామని చెప్పి పంచాయతీకి పిలిచి, ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో సుగ్లామ పల్లి …
Read More »చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
బోడ కాకరకాయ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. వీటితో కర్రీ వండితే ఉండే టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకర కర్రీతో రుచి మాత్రమే కాదండోయ్, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, వర్షాకాలంలో బోడకాకర కాయ తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బోడ కాకర కాయను కూరగాయల్లోనే కింగ్ అంటారు. ఎందుకంటే చికెన్, మటన్‌లో లభించనన్ని పోషకాలు ఇందులో లభిస్తాయి. అందుకే చాలా మంది బోడ కాకర కాయ తినాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా …
Read More »వైసీపీ సింబల్ మార్పు ప్రచారం ఫేక్.. ఈసీకి ఎలాంటి లేఖ రాయలేదన్న అధిష్టానం!
వైసీపీ పార్టీ సింబల్ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ గుర్తును మార్చాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశాసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియాలో …
Read More »స్పేస్ నుంచి భూమిపైకి తిరిగొచ్చిన శుభాన్షు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుండి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అభినందించారు. ఐఎస్ఎస్ సందర్శించిన తొలి భారతీయ వ్యోమ గామిగా శుక్లా చరిత్ర సృష్టించారు. శుక్లా అంకితభావం, ధైర్యం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా శుభాన్షు శుక్లా కొత్త చరిత్ర సృష్టించాడు. తన అంకితభావం, ధైర్యం మార్గదర్శక స్ఫూర్తి …
Read More »‘తల్లికి వందనం డబ్బులు మా నాన్న అకౌంట్‌లో వేయండి’- అధికారులను వేడుకున్న అక్కాచెల్లెళ్లు
తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ అవుతున్నాయి. కానీ ఇద్దరు బాలికలు ఆ నగదు తండ్రికే ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున డబ్బులు జమ చేశాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని ఇద్దరు బాలికలు మాత్రం ఆశ్చర్యకరమైన విజ్ఞప్తితో అధికారుల వద్దకు వచ్చారు. తల్లి ఖాతాకు వచ్చిన ఆ మొత్తాన్ని తమ తండ్రి ఖాతాలో …
Read More »