Kadam

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. మరి ఆయన ఈ నోటీసులపై పై కోర్టుకు వెళ్తారా..? విచారణకు హాజరవుతారా..? డీటేల్స్ తెలుసుకుందాం…మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసినందుకు ఒవైసీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలి కోర్టు …

Read More »

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోకపోవడంతో భర్త ఏం చేశాడంటే..?

ప్రియుడితో భార్య యవ్వారం నడుపుతుందని తెలిసిన ఓ భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందలించిన భార్య బుద్ధి మారకపోవడంతో నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందు తన ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనుమూరు మండలంలో భార్య మరో వ్యక్తిపై మనసు పారేసుకోవడం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మరో వ్యక్తితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోవడంతో ఇద్దరి మధ్య గత కొన్ని …

Read More »

మీ పాదాలు, చేతులు మాటి మాటికీ చల్లబడుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా

సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడటం కామన్. ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొందరికీ ఎల్లవేళలా ఇలా పాదాలు, చేతులు చల్లగానే ఉంటాయి. ఇది అనారోగ్యానికి సంకేతం. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు..చల్లని గాలి ఒంటికి తాకితే ఒక్కసారిగా చేతులు, కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అనంతరం కాసేపటికే ఒళ్లు మళ్లీ వేడెక్కుతుంది. ఇలా చల్లని వాతావరణంలో శరీర భాగాలు వేడెక్కుతున్నాయి అంటే అది మంచి ఆరోగ్యం అని అర్ధం. …

Read More »

తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్‌ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?

అల్లూరి జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. మంప- కొయ్యూరు సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యమవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత.. మృతదేహం మనోజ్ దేనంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ మృతదేహం తమ బిడ్డది కాదని తల్లిదండ్రులు, బంధువులు చెప్తుండడం సంచలనంగా మారింది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్‌.. వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే.. మనోజ్‌ మృతి చెందినట్లు పోలీసులు సమాచారం …

Read More »

సంధ్య థియేటర్ కేసులో మరో కీలక పరిణామం.. దానిపైనే పోలీసుల ఫోకస్..!

సినీ నటులు అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు, స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్య ధియేటర్ ఘటనపై స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్‌ విచారణ కొనసాగుతోంది. థియేటర్‌లో తొక్కిసలాట ఘటనతోపాటు అతర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్‌కు పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ చేపట్టారు. అల్లు …

Read More »

ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై వ్యక్తి పేరుతో పాటు తల్లి పేరు తప్పనిసరి..!

జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మే 1 నుండి అమలు కానుంది. అయితే, అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేర్లను గమనిస్తే.. ముందు ఆ వ్యక్తి పేరు (First Name), తర్వాత ఇంటి పేరు (Surname) లేదా తండ్రి పేరు కనిపిస్తుంది. అంతర్జాతీయ ట్రావెల్ డాక్యుమెంట్ …

Read More »

ఆర్టీసీ డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన బస్సు.. తీరా కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం..!

బస్సు డిపోలో ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ బస్సు డ్రైవర్, అధికారుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు జాడ గుర్తించారు. అయితే, బస్సు ఇక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ ఎక్కేందుకు తెల్లవారుజామున డిపోకు వచ్చిన ఆ డ్రైవర్‌కు.. అక్కడ ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండాపోయింది. ఇటు అటు చూశాడు. కనిపించలేదు. …

Read More »

పార్శిల్‌లో డెడ్‌బాడీ కేసు: అసలు హంతకుడు అతడే! వదిన ఆస్తి కోసం మరిది దారుణం

పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన చెక్క పెట్టెలో డెడ్ బాడీ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వదిన ఆస్తిపై కన్నేసిన మరిది.. డెడ్ బాడీ సాయంతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరగడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని ఓ కూలి ఇతగాడి పన్నాగానికి బలై శవమయ్యాడు..పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెక్కపెట్టెలో గుర్తు తెలియని మృతదేహం పార్శిల్‌ వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం …

Read More »

ప్రశ్నల వర్షం.. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న పోలీసులు

అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ప్రశ్నలు..అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన పై స్పందించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దాని …

Read More »

విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే

తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్‌ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న …

Read More »