Kadam

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త

ఈ ఏడాది 15 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా.. ఇప్పటివరకు తక్కువ వర్షపాతమే నమోదైంది. తెలంగాణ, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : —————————————————————————————————- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు ,రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు …

Read More »

తెలంగాణలో ఇవాళ రేషన్‌కార్డుల పండగ… కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్‌కార్డుల పండగ జరగబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్తగా రాష్ట్రంలో 3,58,187 రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. దీని ద్వారా 11,11,223 మందికి లబ్ధి చేకూరుతుంది. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625కి చేరనుంది. పాత కార్డుల్లో 4,41,851 మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు. ఈ విస్తరణతో మొత్తం 15,53,074 మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, …

Read More »

మట్టి తవ్వుతుండగా మెరుస్తూ కనిపించిన రాయి.. దానిపై ఏవో రాతలు.. ఏంటని చూడగా

చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా.. కాకతీయ, బౌద్ధమత ఆనవాళ్లు చారిత్రక శిల్పకళా సంపదకు నిలయంగా నల్లగొండ జిల్లా ఉంది. ఈ ప్రాంతంలో బౌద్ధమత ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బ్రహ్మలిపికి సంబంధించిన శాసనం వెలుగు చూసింది. బ్రహ్మ లిపి శాసనం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉపయోగించబడిన ఒక రకమైన లిపిలో చెక్కబడిన శాసనాలు.. ఈ లిపిని బ్రాహ్మ లిపి అని కూడా అంటారు. ఇది చాలా పురాతనమైన లిపి.. దేశంలోని …

Read More »

డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా.. ఎలాగో తెలుసా..

ప్రస్తుతం యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు నగదు అవసరమవుతుంటుంది. ఏటీఎం ల నుండి నగదు విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. డెబిట్‌ కార్డు ఇంట్లో మరిచిపోయినా.. కార్డు లేకపోయినా..? డోంట్‌ వర్రీ.. ఏటీఎం డెబిట్ కార్డు లేకపోయినా చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. అందుబాటులో డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. గతంలో నగదు కోసం బ్యాంకులకు వెళ్లి ఖాతా నుంచి విత్ డ్రా చేసుకునే …

Read More »

తక్కువ ధరకే పాండురంగడు, మహా లక్ష్మి సహా ప్రముఖ క్షేత్రాల దర్శనం.. టీఎస్ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటన

శ్రీ మహా లక్ష్మి కొలువైన క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటి కొల్హాపూర్. పంచగంగ నదీ తీరాన ఉన్న ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఇక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా, శక్తిరూపంగా భక్తులతో పూజలను అందుకుంటుంది. అటువంటి విశేష ప్రాముఖ్యత ఉన్న కొల్హాపూర్ కి వెళ్ళాలనుకునే భక్తులకు తెలంగాణా RTC స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ రోజు ఈ టూర్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. …

Read More »

మహిళా రోగిపై వార్డుబాయ్‌ అత్యాచారయత్నం… విద్యానగర్‌ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో దారుణం

మహిళలకు బయటే కాదు.. ఆస్పత్రుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బెడ్‌ మీద చికిత్స తీసుకుంటున్న రోగులను కూడా కామాందులు వదలడం లేదు. హైదరాబాద్‌లో నగరం నడిబొడ్డున ఉన్న ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.పేషెంట్‌పై అత్యాచారయత్నం చేశారు వార్డ్ బాయ్. మహిళా అరుపులతో వెంటనే అప్రమత్తయ్యారు సిబ్బంది. విద్యానగర్‌లోని ఆంధ్రా మహిళా సభ ఆస్పత్రిలో చోటు చేసుకుంది ఈ దారుణం. మహిళా పేషెంట్‌పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలతో బంధువులు అప్రమత్తమయ్యారు. వార్డ్ బాయ్‌ని చితకబాదారు బాధితురాలి కుటుంబ సభ్యులు. అనంతరం …

Read More »

తెలంగాణలో NIE అవగాహన కార్యక్రమం.. ఉప్పు విషయంలో ఆ తప్పు వద్దు అని..

 ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) పరిశోధకులు పంజాబ్, తెలంగాణలో మూడు సంవత్సరాల ఉప్పు తగ్గింపు చొరవను ప్రారంభించారు. ICMR మద్దతుతో ఉన్న ఈ ప్రాజెక్ట్, సోడియం తీసుకోవడం తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కమ్యూనిటీ నేతృత్వంలోని ఆహార సలహా ప్రభావాన్ని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నప్పటికీ, పట్టణ భారతీయులు రోజుకు 9.2 గ్రాములు వినియోగిస్తున్నారు. ఇది సూచించిన పరిమితి కంటే దాదాపు …

Read More »

భయపెడుతున్న భవిష్యవాణి.. మహమ్మారి ముప్పు, అగ్నిప్రమాదాలు ఎక్కువే..

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తానని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారు. ప్రతి సారి …

Read More »

రక్తమోడిన రోడ్డు.. 8 మంది మృతి! మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. స్పాట్‌లోనే ఏడుగురు

కష్టపడి పనిచేసి మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయానికి వారిని మృత్యువు వెంటాడింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో దానిపై ఉన్న కూలీలు అంతా లారీ కింద పడ్జారు. వారిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లి నుంచి మామిడికాయల లోడుతో రైల్వేకోడూరు మార్కెట్ యార్డుకు వెళుతున్న ఐచర్ వాహనం అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి లోని చెరువు కట్ట వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న …

Read More »

అప్పులపాలయ్యా.. నా కారు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

నియోజవర్గంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉందన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని అన్నారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారని.. ప్రస్తుతం తన అల్లుడి కారును వాడుతున్నానన్నారు. ‘‘గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా’’.. అంటూ తూర్పు గోదావరి జిల్లా …

Read More »