ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాగే జరిగింది ఓ ఫైనాన్స్ కంపెనీలో.. అదునుగా భావించిన ఓ ఘరానా ఉద్యోగి పని చేస్తున్న కంపెనీనే బురిడీ కొట్టించాడు. లోన్‌ల పేరిట ఏకంగా ఆరు కోట్లకు టోకరా పెట్టేసి పరారయ్యాడు.అలా ఇలా కాదు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద హౌస్ లోన్లు తీసుకొని.. వాటికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇటు పని చేస్తున్న సంస్థను అటు నమ్మిన స్నేహితులను ఆ ఘనుడు నట్టెట్ట ముంచేశాడ. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా …
Read More »‘దేశం కోసం మోడీ మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు’.. ప్రధానిపై దేవర విలన్ ప్రశంసలు
దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శత జయంతిని పురస్కరించుకుని కపూర్ ఫ్యామిలీ ఇటీవల ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిసింది. కరీనా, సైఫ్, రణ్ బీర్ ,అలియా, కరిష్మా.. ఇలా అందరూ ప్రధానితో భేటీ అయ్యారు. తాజాగా ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను దేవర విలన్ సైఫ్ అలీఖాన్ అందరితో పంచుకున్నారు.దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. ఇందుకోసం ఇటీవలే కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి …
Read More »అతుల్ ఆత్మహత్య.. తెరపైకి కొత్త డిమాండ్.. ఆ చట్టం తేవాలని..
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.భార్య టార్చర్ తట్టుకోలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఆత్మహత్య చేసుకునే ముందు 40 పేజీల లేఖ రాసి.. మరో 80 నిమిషాల వీడియో తీసి.. తాను ఏ విధంగా వేధింపులకు గురవుతున్నానని విషయాన్ని ప్రస్తావించడం… …
Read More »అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి..
స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత రాకపోవడంతో కేకలు వేస్తూ నీళ్లలో మునిగిపోయాడు.. …
Read More »ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు.. మొత్తం 70 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధుల ఎంపికను ఆప్ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించారు కేజ్రీవాల్. తుదిజాబితాలో 38 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరి లోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. బీజేపీ , కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్ ప్రచారంపై దృష్టి …
Read More »ఇండియన్స్‌కి శుభవార్త.. వీసా లేకుండా ఇక ఆ దేశానికి దూసుకుపోవచ్చు..
భారతదేశం రష్యా మధ్య స్నేహపూర్వక సంబంధాలపై నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. రెండు దేశాల మధ్య సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా మరియు పటిష్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తరచుగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడు రష్యా మరోసారి స్నేహపూర్వక సంబంధాలకు ఉదాహరణగా నిలిచి భారతీయులకు పెద్ద బహుమతిని అందిస్తోంది. భారతీయులు 2025లో రష్యాకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు రష్యా కొత్త వీసా నిబంధనలను అమలు చేసిన తర్వాత, భారతీయులు వీసా లేకుండా రష్యాకు వెళ్లవచ్చు. జూన్‌లో రష్యా భారతదేశం పరస్పరం …
Read More »స్వచ్ఛ భారత్ అభియాన్.. ఆ విషయంలో దశాబ్దంలోనే ఎంతో మార్పు..
భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. దశాబ్దం క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నినాదంగా మారి ఎంతో మార్పును తీసుకువచ్చింది.. ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత దశాబ్దం క్రితం ఐదో వంతుతో పోలిస్తే ఇప్పుడు సగానికి పైగా భారతీయ కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇతర లక్ష్యాలతో పాటు, మరిన్ని మరుగుదొడ్లు నిర్మించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా బహిరంగ మలవిసర్జన ముగింపు పలికేందుకు మోదీ …
Read More »రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..
అసలే చలికాలం.. అందులో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు చేరింది. ఇదిగో ఈ లైన్ అంతా ఏదో కొత్త సినిమా …
Read More »మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు.
ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంది. లైసెన్సులు ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయబడతాయి.. ఈ స్టోర్ల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము 15 లక్షల రూపాయిల కాగా.. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయిలుగా నిర్ణయించారు. ప్రతి ఏటా లైసెన్సు రుసుము 10శాతం చొప్పున పెరుగుతుంది. ప్రీమియం షాపుల లైసెన్సుదారులకు ఇష్యూ ప్రైస్‌పై 20 శాతం మార్జిన్ చెల్లిస్తారు. ఈ ప్రీమియం …
Read More »సోషల్ మీడియా పోస్ట్‌లపై పోలీసుల సీరియస్.. అడ్డగోలు పోస్టులకు కేసులు తప్పవని వార్నింగ్..!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే.. తాట తీస్తోంది తెలంగాణ పోలీస్. ఇదే క్రమంలో లేటెస్టుగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై యాక్షన్ మొదలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు.ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతి చిన్న విషయం దగ్గరి నుంచి వార్తల వరకు సోషల్ మీడియానే జనం ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు ఇష్టానుసారం రీల్స్ చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లపై పిచ్చిగా వ్యవహరించడం. డబ్బులు వెదజల్లడం, వెకిలి చేష్టలతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. అయితే …
Read More »