Kadam

తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు.. వైద్యుల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా..అల్లూరి జిల్లా మినుములూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. నిర్మల్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ …

Read More »

పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని …

Read More »

ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి

ఏపీలో అప్పుడే పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి పండగకు నెలరోజుల ముందే పందెం రాయుళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కొట్లాట పెట్టారు. బరిలో బస్తీ మే సవాల్ అని తొడలు కొడుతున్నారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వేలల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలపై సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు బరులపై దాడులు చేశారు. పోలీసులను …

Read More »

విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడిః రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్‌ మెనూ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్‌లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని, సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి సర్వేల్‌లో సంక్షేమ పాఠశాలను ప్రారంభించారని …

Read More »

రెచ్చిపోతున్న ర్యాప్ ముఠాలు.. లక్షల రూపాయల కొల్లగొడుతున్న మాయగాళ్లు..!

బాపట్ల పరిసర ప్రాంతాల్లో ర్యాప్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న అడపా దడపా ర్యాప్ గ్యాంగ్‌ల ఆగడాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ముప్పై మూడు లక్షల రూపాయలను అత్యంత్య తెలివిగా ర్యాప్ గ్యాంగ్ కొట్టేసింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాప్ గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన కల్యాణ్ చక్రవర్తి హోల్ సేల్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతనికి నర్సరావుపేటకు …

Read More »

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టులు! మొత్తం ఎన్నంటే

ఇంటర్మీడియట్‌ అర్హతతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్ల తదితర సంస్థల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మొత్తం 3,712 వరకు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. అయితే ఈ పోస్టులను పెంచుతూ తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన జారీ చేసింది. …

Read More »

రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు.. షూ ధరించిన వారికి నో ఎంట్రీ!

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1368 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరగనుంది. 5,51,847 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు..తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ …

Read More »

మొదటిసారి అగ్రరాజ్యానికి గులాబీ బాస్.. కారణం ఏంటో తెలుసా..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా అమెరికా పయణం కానున్నారు. ఆయన అగ్రరాజ్యానికి వెళ్లడం ఇదే మొదటిసారి. మరి మాజీ ముఖ్యమంత్రి ఎందుకని అమెరికా వెళ్తున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, మంచి సాహిత్య అభిమాని ఇలా చాలా రకాలుగా ఆయన గురించి ప్రజలకు తెలుసు. కానీ ఇది మాత్రం చాలామందికి తెలవని ఆసక్తికరమైన ఓ విషయం. మామూలుగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు. అందులోనూ అధికారంలో ఉంటే ఎక్కే విమానం.. దిగే విమానం …

Read More »

అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు వాంగ్మూలం రికార్డు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.మొన్నటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. టీవీ9 మీడియా రిపోర్టర్ రంజిత్ పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. …

Read More »

పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. అనుమానమొచ్చి చెక్ చేయగా

పోలీస్ నేమ్ బోర్డుతో ఓ వెహికల్ ఒడిశా నుంచి ఏపీలోకి ఎంటరైంది. మొదట ఆ వాహనంపై ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేయగా..పోలీస్ నేమ్ బోర్డుతో ఒడిశా నుంచి ఏపిలోకి స్పీడ్‌గా దూసుకొస్తుంది ఓ బొలెరో వెహికల్. పోలీస్ వెహికల్ కదా ఏదో మేజర్ క్రైమ్ జరిగి ఉంటుందనుకొని ఎవరికి వాళ్లే చెక్ పోస్ట్స్ దగ్గర చెక్ చేయకుండా హడావుడిగా వదిలేశారు. అలా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పోలీస్ వెహికల్ విజయనగరం జిల్లా రామభద్రపురం …

Read More »