శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు గమనించాల్సిన విషయం ఇది. జలాశయం నిండడంతో భక్తుల రద్దీ పెరగడంతో.. ఈ వారం మధ్యాహ్నం సమయంలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ప్రకటించింది. పరిస్థితిని భక్తులు అర్థం చేసుకోవాలని కోరింది . ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం (మంగళవారం నుండి శుక్రవారం వరకు) ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో జలాశయం నిండుకుండలా …
Read More »ఇక నుంచి రైళ్లలో ఏం జరిగినా తెలిసిపోతుంది.. రాత్రి వేళల్లో కూడా.. ఎలానో తెలుసా?
సాధారణంగా పట్టణాల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు ఈజీగా వాళ్లను పట్టుకుంటారు. కానీ రైళ్లలో దొంగతనాలు జరిగితే వాళ్లను పట్టుకొవడం రైల్వే పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో ప్రయాణికులు పొగొట్టుకున్న వాటిని తిరిగి రికవరీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రైన్స్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటి సహాయంతో ట్రైన్‌లలో దోపిడీలకు పాల్పడే వారిని గుర్తించొచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దోపిడీ దొంగల బీభత్సం. ప్రయాణికులను …
Read More »బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు.. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌గా ఎంపిక
బొబ్బిలి వీణకు మరో జాతీయ గౌరవం లభించింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించిన గుర్తింపు ఈ కళకు నూతన ఊపిరిగా నిలవనుంది. రాజుల కాలం నుంచి తరతరాలుగా సాగుతున్న ఈ హస్తకళ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి వినిపించబోతోంది. చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపిక అయ్యింది. ఈ అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ …
Read More »గుడ్‌న్యూస్.. అమరావతిలో రూ.2,200 కోట్లతో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు.. అధికారికంగా ప్రకటించిన కేఎమ్ బిర్లా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదికగా మారుతోంది. ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతిలో బిట్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో, డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్‌తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 7000 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ క్యాంపస్ నిర్మిస్తామని ఆయన …
Read More »ఈనెల 26న సింగపూర్‌కు చంద్రబాబు బృందం – ఎందుకో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ టూర్ ఖరారైంది. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనుంది. అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు …
Read More »ఉదయగిరిలో దారుణ హత్య.. పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికి చంపారు!
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ హమీద్ అనే యువకుడిని అందరి ముందు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కొండాపురం మండలం గరిమినపెంటకు చెందిన హమీద్‌పై ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వాటాదారులు ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో హమీద్, హనీఫ్, ఉమర్ అనే ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్‌ను ఉమ్మడి భాగస్వామ్యంగా నిర్వహించేవారు. అయితే ఇటీవల ఈ …
Read More »హైలెవెల్ కరప్టెడ్ అసోసియేషన్.. దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో.. ఏళ్ల తరబడి ఇదే దందా!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వివాదాలకు కేరాఫ్‌గా మార్చిన కారణాల్లో క్రికెట్ క్లబ్బులదీ కీలక పాత్రే. కొందరు బడాబాబులు క్లబ్బుల పేరుతో HCAలో తిష్టవేసుకుచి కూర్చున్నారు. అసలు ఈ క్లబ్బుల గోల ఏంటంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది తెలంగాణలో ఉన్న ఈ 217 క్లబ్బులే. ఒక్కో క్లబ్‌కి ఒక్కో ఓటు. అందుకే, హెచ్‌సీఏ రాజకీయం అంతా వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. HCA.. హైలెవెల్ కరప్టెడ్ అసోసియేషన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనగానే.. ‘దారితప్పిన, అవినీతిమయమైన సంఘం’ అనే ట్యాగ్‌లైన్ ఇస్తారు గానీ.. ఎంత ఖ్యాతి ఉండేదో …
Read More »తెలంగాణలో భూ సమస్యలకు చెక్.. ఇకపై గ్రామానికో జీపీవో, మండలానికి 4-6 సర్వేయర్లు.. మంత్రి పొంగులేటి!
తెలంగాణలో భూసంబంధిత సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి లైసెన్స్‌డు సర్వేయర్లను, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ అధికారిని (జీపీవో), ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరు మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు నియమించనున్నట్టు మంత్రి …
Read More »ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఎప్పుడిస్తారంటే?
తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ గురుకులాల్లో ఇంటర్ చదివిన విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ పాఠశాలల్లో ఇంటర్ పాసై 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీల్లో సీటు సాధించిన వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే పది, ఇంటర్‌లో ప్రతి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురి చొప్పున విద్యార్ధులకు నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు కూడా బహుమతులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ …
Read More »హైదరాబాద్ శివారులో భయం భయం… ఒంటరిగా బయట తిరగొద్దని అధికారుల ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బాలాపూర్‌లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో రెండు చిరుతల సంచరించడం నిజమేనని అధికారులు తేల్చారు. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో చిరుతల సంచారం స్థానికంగా సంచలనంగా మారింది. గతంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుత పులులు సంచరించాయి. నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు అటవి అధికారులు శ్రమించి నగర శివార్లలో తిరుగుతున్న పులులను పట్టుకున్నారు. అనంతరం …
Read More »