పూజలు.. ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలియదు గానీ…వీటి పేరు విన్నా, వీటిని చూసిన ఎవరైనా వణికిపోతారు. మూఢనమ్మకాలను నమ్మే వారైతే వారికి ఇక నిద్రపట్టదు.. ముఖ్యంగా హర్రర్ మూవీలలో ఈ క్షుద్ర పూజలను మరి భయంకరంగా చూపిస్తారు. క్షుద్ర పూజలు ద్వారా ఎవరినైన లోబరుచుకోవటం, వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం, వారిని చావు అంచుల వరకూ తీసుకువెళ్ళడం వంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తూ ఉంటే ఇక ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మంత్ర, తంత్రాలు… నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు …
Read More »శ్రీకాకుళంలో విషాదం.. డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్‌కి గుండెపోటు..సీట్‌లోనే కుప్పకూలి..
రెప్పపాటు జననం..రెప్పపాటు మరణం అన్నారు పెద్దలు.. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతోన్న మరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండానే అకాల మరణాలు జరుగుతున్నాయి. చిన్నారులు, కాయ కష్టం చేసుకునే కస్టజీవులు సైతం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లతో మరణిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్‌పేట జంక్షన్ వద్ద డ్రైవింగ్ చేస్తూ గుండె పోటుతో లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అయితే డ్రైవర్ మృతితో లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై భారీ విధ్వంసాన్ని …
Read More »ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు.. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న మెగా బ్రదర్.
ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. జనసేన తరపున మంత్రి వర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయనకు కేటాయించే శాఖల పై క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం …
Read More »ఒక్కసారిగా పతనమైన టమాటా ధర.. కేజీ ఎంతో తెల్సా..?
మొన్నటివరకు పై చూపులు చూసిన టమాటా ధర ఒక్కసారిగా దారుణంగా పతనమైంది. ఏకంగా కిలో టమాటా ఒక్క రూపాయికి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎక్కడో.. ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం…నిన్న మొన్నటి వరకూ టమాటా ఓ మోత మోగించింది. కొనాలంటేనే భయపడేలా చేసింది. సెంచరీ కొట్టి టమాటా సామాన్యులకు సవాల్ విసిరింది. ఆ తర్వాత.. చాలారోజుల వరకూ అరవై రూపాయలు.. కొద్దిరోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతోంది. అయితే.. మారుతున్న మార్కెట్ పరిస్థితులతో టమాటా రేటు చిన్నగా దిగొచ్చింది. కొంతకాలంగా హెచ్చుతగ్గులతో నడుస్తున్న టమాటా ధర.. …
Read More »మోహన్ బాబు ఇంటి చుట్టూ బౌన్సర్లు.. 30 మందిని దింపిన మనోజ్
మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ . మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్‌బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్‌బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి .మంచువారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్‌బాబు కుమారులు మంచు విష్ణు-మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ …
Read More »నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది!
నంద్యాల జిల్లా నందికొట్కూరు లోని బైరెడ్డి నగర్ లో ఉంటున్న లహరి.. స్థానిక నంది కాలేజీలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతోంది. స్వగ్రామం వెల్దుర్తి మండలం రామళ్లకోట. అయితే తండ్రి మృతి చెందడంతో నందికొట్కూరులో అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుతోంది. అదే మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు కేవలం పరిచయస్తుడు మాత్రమే. ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఎగ్జామ్స్ దగ్గరగా ఉండటంతో లహరి చదువు మీద శ్రద్ద పెట్టింది. ఆవేశం కసి పెంచుకున్న రాఘవేంద్ర.. ఈ తెల్లవారుజామున అమ్మమ్మ …
Read More »నటి జయసుధ ఎక్కడ? పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా.. మళ్లీ తెరపైకి మూడో పెళ్లి!
సహజనటి జయసుధ గత కొంత కాలంగా అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా లేరు. దీంతో నటి జయసుధకు ఏమైంది.. ఎక్కడికి వెళ్లిపోయారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు? ఈ క్రమంలో గతంలో వచ్చిన మూడో పెళ్లి ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది..కంటే కూతుర్నే కనాలి… ఇన్స్పెక్టర్ ఝాన్సీ… ఆడపులి.. లాంటి సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన సహజ నటి జయసుధ ఎన్నో వైవిద్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. రీల్ లైఫ్‌లో ఏ పాత్ర చేసిన అతికినట్లు చేసిన ఆమె.. రియల్ లైఫ్‌లోనూ …
Read More »సేవింగ్ ఖాతాలో ఎంత డిపాజిట్ చేయొచ్చు.. ఆదాయపు పన్ను కొత్త నిబంధనలు
సేవింగ్స్ ఖాతాలలో పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను శాఖ పైన పేర్కొన్న నిబంధనలను అనుసరించి డిపాజిట్ చేయాలి. ఈ పరిమితులకు మించి లావాదేవీలు జరిగితే సంబంధిత బ్యాంకులు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి.. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రజలు తమ బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో రోజుకు ఎంత డబ్బు జమ చేసుకోవచ్చో.. ఏడాదిలో ఎంత డబ్బు జమ చేసుకోవచ్చో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో …
Read More »ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు ‘తెలుగు సబ్జెక్ట్’ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు
SSC మినహా మిగతా బోర్డులకు సంబంధించిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నిబంధనను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని, 9, 10 తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది..తెలంగాణ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ప్రస్తుత (2024-25), వచ్చే విద్యా సంవత్సరం (2025-26) తొమ్మిదవ, పదో తరగతి చదివే విద్యార్ధులు …
Read More »ఆధార్ కార్డులాగా విద్యార్థులకు అపార్ కార్డ్.. దీని ప్రయోజనం ఏంటి?
APAAR ID Card: సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చాట్‌లో ఆధార్ కార్డ్ వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది..ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు …
Read More »