స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ మందిర్‌లో రికార్డ్ చేయబడిందని సమాచారం. వీడియో వైరల్ కావడంతో ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఈ వీడియో నిజమా లేదా నకిలీదా అని తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజలలో తారాస్థాయికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఈ ఆలయానికి చేరుకుని ఘటనను పరిశీలించారు.సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలు చాలా వరకు ప్రజల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని షాక్‌కు గురిచేసేవిగా కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి …
Read More »IRCTC వెబ్‌సైట్ సేవలకు అంతరాయం.. రైల్వే ప్రయాణీకుల అవస్థలు
IRCTC ఆన్‌లైన్ ఈ-టికెట్ బుకింగ్ సేవలకు సోమవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ కుదరలేదు. టిక్కెట్ల క్యాన్సలేషన్ కూడా సాధ్యంకాలేదు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC వెబ్‌సైట్ నిలిచిపోయింది. దీంతో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. వెబ్‌సైట్‌లో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని, అందువల్ల మరో 1 గంట వరకు …
Read More »స్మశానం పక్కన ఆ కారులో వేగంగా వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
తాడేపల్లి స్మశాన వాటిక వద్ద సగం కాలిన కారు పార్క్ చేసి ఉంది. దానిపై గ్రీన్ మ్యాట్ కూడా కప్పి ఉంది. అయితే అప్పటి నుంచి ఆ కారు నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్మశానవాటిక పక్కనే నివసించడం వారికి అలవాటు. స్మశానం పక్కనే ఉన్నా.. ఎప్పుడూ ఇంత ఆందోళనకు గురి కాలేదు. అయితే ఇప్పుడెందుకనుకుంటున్నారా..! సగం కాలిన కారును గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలిపెట్టి పోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో …
Read More »క్యాన్సర్‌ని కూడా ఖతం చేసే శక్తివంతమైన పండు..! ప్రతిరోజు తింటే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..
సపోటా పండు ఇష్టపడని వారంటూ ఉండరనే చెప్పాలి. భిన్నమైన తీపి రుచితో ఉండే ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండివున్నాయి. ముఖ్యంగా ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా మన దేశం పండు కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది స్పెయిన్‌కు చెందినది. ఈ చెట్లు మధ్య అమెరికాలో పుష్కలంగా కనిపిస్తాయి. స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించారని సమాచారం. చలికాలంలో సపోటా లాభాలు …
Read More »తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేస్తే..
మన ప్రకృతిలో ఉన్న అనేక మొక్కలు, వృక్షాలలో ఎన్నో ఔషధ గుణాలు నిండివున్నాయి. అందులో అతి ముఖ్యమైనది అత్యంత పవిత్రమైనది తులసి మొక్క. మన పూర్వీకుల కాలం నుంచి తులసిని అత్యంత పవిత్రమైనదిగా కొలుస్తూ వస్తున్నారు. పురాణాలలో కూడా తులసి మొక్కను విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి తులసిని నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని ఔషధ గుణాలు ఆరోగ్యంతోపాటు సౌందర్య పోషణలో కూడా మేలు చేస్తాయి. తులసిలోని కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలు, వేర్లు, వేర్ల దగ్గరి మట్టి కూడా …
Read More »ఢిల్లీకి అందుబాటులో మరో అంతర్జాతీయ విమానాశ్రయం.. నేటి నుంచి ట్రయల్ రన్..
NOIDA AIRPORT: పెరిగిన రద్దీ, పెరుగుతున్న డిమాండ్‌తో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీకి సమీపంలో నోయిడా శివార్లలో జేవర్ వద్ద అధునాతన హంగులు, సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయం “నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్” (NIAL) రెడీ అవుతోంది.దేశ రాజధాని ఢిల్లీకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో జీఎంఆర్- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (GMR-IGIA) ఉండగా.. ఇది దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా మారింది. దీంతో పాటు రక్షణశాఖ పరిధిలో ఎయిర్‌బేస్‌లు …
Read More »నా నెంబర్ 2 కాదు.. 3 కాదు.. టీవీ9 కాంక్లేవ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో నేను నెంబర్ 2 కాదు.. 3 కాదు.. నా నెంబర్ 11 అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.. గతంలో మంచిశాఖ దక్కిందని మాత్రమే చెప్పానంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డీకే శివకుమార్ అంత సీనియర్ కాదంటూ పొంగులేటి పేర్కొన్నారు.. శక్తివంచన లేకుండా ప్రజలకు అండగా ఉంటానంటూ వివరించారు.. ఏడాది పాలనపై మాట్లాడుతూ.. …
Read More »అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది.అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి …
Read More »సీబీఐ కేసులో అరెస్ట్ చేస్తామంటూ వీడియో కాల్.. కట్‌చేస్తే ఖాతాలోంచి రూ.15 లక్షలు ఉష్ కాకి
ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు.సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాము..మీ దగ్గర హవాలా డబ్బు ఉంది హవాలా వ్యాపారం చేస్తున్నారు..సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు..ఖమ్మం జిల్లా వైరాలో ఓ రిటైర్డు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన బ్యాంకు ఖాతా నుంచి …
Read More »తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత అదే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వేరు దేవత వేరు అని, ఏ తల్లికి కిరీటం ఉండదని స్పష్టిం చేశారు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా? ఈ అంశాన్ని …
Read More »