Kadam

గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయిన డ్రైవర్.. కాలవలో పడిన కారు.. తప్పిన ప్రాణాపాయం

కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్లి ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై గూగుల్ మ్యాప్స్‌తో చూపించిన విధంగా వెళ్ళిన వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.దారి తెలియకపోతే ఏమిటి.. గూగుల్ మ్యాప్ ఉండగా చింత ఎందుకు దండగ అని అనుకుంటున్నారా.. గూగుల్ మ్యాప్ పై భరోసాతో వాహనంలో ప్రయనిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త. గుడ్డిగా గూగుల్ ని నమ్మి గూగుల్ మ్యాప్స్‌ మార్గనిర్దేశం చేసిన …

Read More »

భారతదేశంలోనే అతిపెద్ద నోటు.. 32 ఏళ్లుగా చెలామణిలో..

Indian Currency Notes: ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోటు అతిపెద్ద నోటు. అయితే దేశంలో రూ.10,000 నోటు చెలామణిలో ఉన్న సమయం ఉంది. అది కూడా స్వాతంత్య్రానికి ముందు. 1938 సంవత్సరంలో రూ.10,000 నోటును విడుదల చేశారు. ఈ నోటు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నోటు. అందుకే ఈ నోటు చలామణిలోకి వచ్చినప్పటి నుండి మూసివేసే వరకు దాని ప్రయాణం గురించి తెలుసుకుందాం. నోటు ఎందుకు తెచ్చారు? స్వాతంత్య్రానికి ముందే ఇంత పెద్ద నోటును చలామణిలోకి తీసుకురావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇంత పెద్ద …

Read More »

ప్రెగ్నెన్సీ టైమ్‌లో పొట్టపై దురద ఇబ్బంది పెడుతుందా? ఇలా చేస్తే చిటికెలో మాయం

తల్లి అవడం ప్రతి అమ్మాయికి ఓ అద్భుతమైన అనుభవం. ఆ సమయంలో పుట్టబోయే తన బిడ్డను తల్చుకుంటూ ఎంతో మురిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. దీంతో కంగారుపడిపోతుంటారు కాబోయే అమ్మలు. ముఖ్యంగా రోజులు గడిచేకొద్దీ పెరుగుతున్న పొట్టచుట్టూ విపరీతమైన దురద వేధిస్తుంది.. దీని నుంచి ఉపశమనం పొందాలంటే.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొంత మందికి అవగాహన లేకపోవడం వల్ల మరింత టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి …

Read More »

జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌.. కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇక మరింత బాదుడు..!

మీరు స్మోకరా.. టొబాకో ఉత్పత్తులేమైనా వాడతారా? పోనీ.. కార్లు, కాస్ట్‌లీ డ్రస్‌లు, కాస్మొటిక్స్‌ ఇష్టపడతారా? అయితే ఈ న్యూస్ మీకోసమే! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ విషయంలో మరో ముందుడుగు వేసింది. కొత్తగా మరో శ్లాబ్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.. జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌ను తెచ్చే యోచనలో ఉంది కేంద్రం. సిన్‌ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కేటగిరీని తయారుచేస్తుంది. ఈ  ప్రొడక్ట్స్‌పై కొత్తగా 35% జీఎస్టీ విధించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జరిగిన జీఎస్టీ- గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ …

Read More »

భవిష్యత్తు అమరావతికి తొలి అడుగు.. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో జాప్యం, రాజకీయ విమర్శలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటి మధ్య ఆయన రాజధాని అభివృద్ధి కోసం కొనసాగించిన కృషి ప్రశంసలకు పాత్రమైంది. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదన్న విమర్శ తరచూ గట్టిగా వినిపిస్తూ వచ్చేది. ఈ విమర్శలకు సీఎం చంద్రబాబు ఇప్పుడు చెక్ పెట్టారు. త్వరలో సీఎం చంద్రబాబు ఇంటి చిరునామా మారబోతోంది. గత పదేళ్లుగా లింగమేనని అతిథిగృహంలో ఉంటున్న …

Read More »

రెప్పపాటులో మాయమవుతున్న సొమ్ము.. సైబర్ నేరాల నియంత్రణకు చెక్ పెట్టేదీ వాళ్లేనా..!

భారతదేశంలో ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ ఆరేబియా తరహాలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలంటున్నారు సైబర్ నిపుణులు.టెక్నాలజీ పెరిగే కొద్దీ, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ కలిగిస్తోంది. అయితే ఈ తరహా నేరాల నిరోధంలో బ్యాంకులు …

Read More »

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఆమోదించారు. గురువారం(డిసెంబర్ 5) ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత 11 రోజులుగా సాగుతున్న మహాయుతి హైవోల్టేజీ డ్రామా ఎట్టకేలకు ముగిసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. పార్టీ …

Read More »

స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం.. బాదల్‌పై దాడి చేసిన నారాయణ్‌సింగ్ చౌరా ఎవరో తెలుసా..?

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం (డిసెంబర్ 4) దాడి జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సుఖ్‌బీర్ బాదల్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో సేవ చేస్తుండగా ఓ వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సుఖ్‌బీర్ బాదల్ క్షేమంగా బయటపడ్డారు. అయితే అకాలీదళ్ నాయకుడు ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. గురుద్వారాలో శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ ఇచ్చిన మతపరమైన …

Read More »

బీరకాయ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, గుండెకు కూడా మంచిదే..!

బిరకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బీరకాయతో కలిగే ప్రయోజనాల్లో..ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పోషకాలు కూరగాయల్లో ఉంటాయి. అలాంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. రోగనిరోధక …

Read More »

ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు

మన దేశంలో ఏ స్టేషన్‌లో చూసిన రైలు కరెక్ట్ టైంకి రావడం అనేది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. తరచూ రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తుంటారు. అయితే ఈ అసౌకర్యానికి చెక్‌ పెట్టేందుకు రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు స్పెషల్ ఆపర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో మాదిరి ప్రయాణించవల్సిన రైలు ఆలస్యం వస్తే రైల్వే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్‌ పాలసీ కింద …

Read More »