Kadam

కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మరో పోరాటం చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సాధనకు కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తట్టిలేపేలా.. అప్పటి ఉద్యమాన్ని గుర్తుతెచ్చేలా… ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టేలా… రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్‌ ఎలా జరిగింది…? కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఎక్కుపెట్టిన బాణాలేంటి…?తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తా… కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యా… ఇవి తరుచూ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు.. ఇక ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ఫుల్‌ సీరియస్‌గా తీసుకుంది. ఎప్పటికప్పుడు రేవంత్‌ కామెంట్స్‌కి కౌంటర్లు ఇస్తూనే… …

Read More »

ఇక ప్రజల్లోకి జగన్.. జిల్లాల వారీగా పర్యటనలు ఎప్పటి నుంచంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఓ వైపు సోషల్ మీడియా అరెస్టులు, మరో వైపు అదానీ వ్యవహారం.. ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు.. తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. …

Read More »

డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. యాంకరేజ్‌ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్‌ రెండు రోజుల క్రితం సముద్రంలో …

Read More »

అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు..

అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్‌లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌ వెలుపల అక్రమంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున …

Read More »

Amazon: ఆఫర్ల జాతర.. అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్ మరో ఆకర్షణీయమైన సేల్‌తో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లభిస్తున్న ఆఫర్లు ఏంటి.? ఏయే వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్స్‌ లభించనున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..బ్లాక ఫ్రైడే సేల్‌ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. షాపింగ్‌ సీజన్‌ ప్రారంభానికి సూచికగా ఏటా బ్లాక్‌ ఫ్రైడే్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్‌ను భారత్‌లోనూ …

Read More »

మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా.? గుండెపోటు వస్తుంది జాగ్రత్త..

గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే జీవనశైలి మొదలు తీసుకునే ఆహారం వరకు గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మనందరకీ తెలిసిందే. అయితే మరో అలవాటు కూడా గుండె జబ్బులు వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇటీవల గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఆడుతుపాడుతు ఉంటూనే ఆద్యాంతరంగా తనువు చాలిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు …

Read More »

తుఫాన్ ముప్పు బాబోయ్.! ఏపీకి వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాలకు అలెర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 29 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 10 .6 ° తూర్పు రేఖాంశం 82.6 °వద్ద అదే ప్రాంతములో కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి ఉత్తర ఈశాన్యముగా 270 కి.మీ, నాగపట్టణానికి తూర్పుగా 300 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల …

Read More »

మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

వైరా మండల విద్యా శాఖలో రెబ్బవరం క్లస్టర్ సీఆర్పీగా రవి పని చేశారు. అతను ప్రతి రోజూ మద్యం సేవించి విధులకు హాజరవుతుండటం, ఎన్నిసార్లు మందలించినా.. అతని తీరు మారలేదు.భర్త వేధింపులు తట్టుకోలేక విసిగి వేసారిన భార్య తెగించింది. అందరు చూస్తుండగానే భర్తపై కత్తితో దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే …

Read More »

Heart Attack: యువతలో గుండెపోటు ఎందుకు పెరుగుతోంది..? నిపుణుల షాకింగ్‌ విషయాలు!

మారుతున్న జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం లైఫ్‌ స్టైల్‌ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇటీవల కాలంలో గుండెపోటుతు మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుండెపోటు ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి. యువకులను సైతం వదలడం లేదు. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సెలబ్రెటీలు, క్రికెట్‌ ప్లేయర్లు దీనిబారిన పడుతున్నారు. తాజాగా పుణె వేదికగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటివరకూ తమతో ఆడుతున్న ఆటగాడు …

Read More »

చలికాలంలో రోజుకెన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా..? చాలా మంది చేసే పొరబాటు అదే

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది తగినంతగా నీళ్లు తాగరు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, ఈ కాలంలోచలికాలం మొదలైంది. చలిగాలుల కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది నీళ్లు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ శీతాకాలంలో కూడా శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుచేత చలి కాలంలో తీసుకునే ఆహారం నుంచి మనం తాగే నీటి …

Read More »