అవినీతి అధికారులే వారి టార్గెట్. కరప్షన్ ఆఫీసర్లను పట్టుకోవడం వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడమే వారి పని. ఇలా చాలమంది ప్రయోగం చేశారు. చాలా వరకు వారి ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో ఓ వీఆర్వోను అదేవిధంగా బెదిరించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ప్లాన్‌కు ఎండ్ కార్డు పడింది. తిరుపతి జిల్లాలో నకిలీ ఆఫీసర్స్ ముఠా గుట్టు రట్టయింది. విజిలెన్స్ అధికారులమంటూ రంగంలోకి దిగిన ఫేక్ ఆఫీసర్స్.. కరప్షన్ ఆఫీసర్ టార్గెట్‌గా వ్యూహం పన్నారు. నలుగురు …
Read More »జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజులు రిమాండ్… పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు
HCA అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్‌గిరి కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. 2024 మే కంటే ముందు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనలకు సంబంధించి తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. HCA ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు, …
Read More »ఇంజనీరింగ్ కోర్సుల ఫీజు పెంపుకు CBITకి హైకోర్టు అనుమతి.. నేడు తుది తీర్పు!
2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. CBIT వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని TG Eapcet అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, MTech కోర్సుకు రు.1,51,600, MBA/MCA కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు CBITని అనుమతించింది. పెరిగిన …
Read More »తెలంగాణ నీట్ యూజీ 2025 ర్యాంకర్ల లిస్ట్ వచ్చేసింది.. ఫుల్ జాబితా ఇదే!
నీట్ యూజీ 2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 43,400 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపిక జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఇది కేవలం నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు తెలిపే జాబితా మాత్రమేనని, మెరిట్ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఎస్‌సీసీఎల్ మెరిట్ జాబితాను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. …
Read More »రైల్వే స్టేషన్‌లో స్టార్ హోటల్‌ను మించి.. మ్యాటర్ తెలిస్తే ప్రయాణీకులు క్యూ కట్టేస్తారంతే
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే జర్నీ సౌకర్యవంతంగా ఉండాలి. అలసిపోయే ప్రయాణికుడికి కాస్త రిలాక్స్ కుదిరితే శారీరకంగా, మానసికంగా ఆ సంతృప్తే వేరు. ట్రైన్ దిగిన తర్వాత.. గమ్యస్థానానికి వెళ్లే ముందు గాని.. రైల్వే స్టేషన్‌కు వెళ్లి గంటల తరబడి రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు గానీ.. కాస్త విశ్రాంతి దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది. చాలామంది ప్రయాణికులు.. తమ జర్నీలో మిగిలిన సమయం కాస్త రిలాక్స్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అటువంటివారు ఫ్లాట్‌ఫార్మ్‌పై ఉన్న కుర్చీ పైనో.. లేక …
Read More »తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించండి… టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు? : బండి సంజయ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారుని.. వారిని వెంటనే తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు.. ఘాటుగా హెచ్చరిస్తున్నానని చెప్పారు బండి సంజయ్. ఇంకెన్ని రోజులు అన్యమతస్తులను కొనసాగిస్తారు.. వెంటనే ఫుల్ …
Read More »రెండు రోజులుగా ఆకలితో అలమటించి చిన్నారి మృతి? సీఎం చంద్రబాబు ఆరా..
రెండున్నరేళ్ల లక్షిత్ అనే చిన్నారి రెండు రోజులుగా కనిపించకుండా పోయి, చివరకు మృతదేహంగా కనిపించాడు. అంగన్వాడీ కేంద్రం నుండి పోయిన లక్షిత్ ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. ఆహార, నీటి లేమితో అతడు మృతి చెందినట్లు అంచనా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారి లక్షిత్ చివరకు మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి నారా …
Read More »మోస్తరు వానలతో సరిపెడుతున్న వరుణుడు.. ఇప్పట్లో భారీ వర్షాలు లేనట్లే!
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ కనిపించడం లేదు. భారీ వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురుచూడాలని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉత్తరాదిన వర్షాలు ఊపేస్తుంటే.. దక్షిణాదిన మాత్రం బలమైన ఈదురుగాలులతో సరిపెట్టుకుంటుంది.. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గడ్, మీదుగా దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర చత్తీస్గడ్ మీదుగా విదర్భ …
Read More »ఏపీ లిక్కర్ కేసులో మరోసారి విజయసాయిరెడ్డికి పిలుపు… రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ కేసులో మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఏప్రిల్ 18న ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటూ ఆనాడు ఆయన ఆరోపించారు. తన సమక్షంలోనే మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని.. కానీ, ఈ పాలసీతో తనకు సంబంధం …
Read More »ప్రాజెక్టులకు జలకళ… కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండు కుండను తలపిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నది, గోదావరి నది కింద ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండడంతో 11 గేట్లు ఎత్తివేత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ తుంగభ్రదకు ఇన్ ఫ్లో 42వేల 290 క్యూసెక్కులు కాగా.. …
Read More »