రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్ వస్తువులను కిట్ రూపంలో …
Read More »గురుకుల విద్యార్ధులకు భలే ఛాన్స్.. నారాయణ విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, నీట్‌లో అతి కొద్దిమార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో ఇప్పటికే మంత్రి నారాయణ చర్చించారు కూడా. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మొత్తం 80 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ …
Read More »నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో 50 వేల ఉద్యోగాలకు త్వరలో వరుస నోటిఫికేషన్లు!
నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన రైల్వేశాఖ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఇప్పటికే 9వేలకు పైగా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. త్వరలోనే మిగితా ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాదికి మొత్తం 55,197 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదికి అంటే 2026-27 ఆర్ధిక సంవత్సరానికి కూడా మరో …
Read More »ఆ దేశాలకు చుక్కలే.. ప్రతి కదలికపై నిఘా.. వాటి కొనుగోలుకు కేంద్రం రెడీ..!
ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా శత్రు దేశాల కదలికపై నిఘా పెట్టేందుకు MALE డ్రోన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా వీటిని రూపొందించనుంది. వీటితో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల కదలికలను అత్యంత కచ్చితత్వంతో గమనించడం సాధ్యపడుతుంది. దేశ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఓవైపు సొంత శాటిలైట్ల ద్వారా అంతరిక్ష నుంచి నిఘా …
Read More »నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష..
సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టులు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన …
Read More »ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు..
ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదిక కీలక ట్వీ్ట్ చేశారు. ఈ గురు పూర్ణిమ రోజున, మీ అంతర్గత శ్రేయస్సు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. మీరు సాధన చేయండి, ధ్యానం చేయండి, మీ మనస్సును ఒక అద్భుతం చేయండి.. మీ గురువు అనుగ్రహం మీతో ఉంటుంది.. …
Read More »పవన్ కల్యాణ్ సవాల్ స్వీకరించిన మంత్రి లోకేశ్.. ఛాలెంజ్ ఏంటంటే..?
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు టీచర్‌గా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించారు. రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. …
Read More »రాత్రి 10 గంటలకే నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..? గుండె ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసా..?
రాత్రి 10 గంటలకే నిద్రపోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణకు, మానసిక ప్రశాంతతకు ఇది ఓ అద్భుత మార్గం. ఈ అలవాటు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. చాలా మంది నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పనిలో మునిగిపోయి.. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం నిద్ర పట్ల అలసత్వం పెంచింది. కానీ ప్రతిరోజు రాత్రి 10 గంటలకే …
Read More »సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే… క్లారిటీ ఇచ్చిన హైడ్రా
చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టం చేసింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడంలో వెనకా ముందు ఆలోచించాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువులను రక్షించడానికి.. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి హైడ్రాను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఆక్రమణదారుల పనిపడుతోంది ప్రభుత్వం. హైడ్రా …
Read More »నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం… గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్ష
ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీల్లో 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి.. ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్‌గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. ఆలస్యమైన నిర్ణయానికి బాధ్యులెవరు? అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది.. అసలు కార్యాచరణ మొదలుపెట్టారా లేదా.. ఇలా అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మంత్రి దగ్గర నుంచి …
Read More »