Kadam

చర్యలా… చర్చలా..? రెబల్స్‌కి రంగు పడుద్దా?… ఇవాళ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ కీలక భేటీ

ఇవాళ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశానికి ప్లాన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. భేటీలో ఏం జరుగబోతుంది… ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..? బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా? అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా? లేక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇలాగే వర్థిల్లాలి అంటూ లైట్ తీసుకుంటుందా? ఇలా అనేక క్వశ్చన్‌మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాన్చకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన …

Read More »

ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు

మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఇటీవలే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే ఆయన కోలుకుని డిశ్చార్జి కావడంతో అంతా సంతోషించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్ల సూచనతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. షుగర్, సోడియం లెవల్స్‌లో తేడాలు ఉండడంతో …

Read More »

 బీ కేర్‌ ఫుల్‌ తమ్ముళ్లు..! గీత దాటితే మంత్రి పదవి ఉండదు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

బీ కేర్‌ ఫుల్‌ తమ్ముళ్లు…! లైన్ క్రాస్‌ చేశారో ఇక దబిడిదిబిడే..! సబ్జెక్ట్‌ నేర్చుకోండి.. సబ్జెక్ట్‌పైనే రాజకీయాలు చేయండి..! కాదుకాడదూ ఇష్టం వచ్చింది మాట్లాడతాం, నచ్చినట్లు చేస్తాం.. అనంటే ఇక రోజులు లెక్కపెట్టుకోండని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు.. అభివృద్దే లక్ష్యం.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. గీత దాటి ఎవరైనా మాట్లాడితే నెక్ట్స్‌ డే మంత్రి …

Read More »

వైభవంగా అప్పన్నగిరి ప్రదక్షిణ.. భక్తులతో కిక్కిరిసిన సింహగిరి రహదారులు .. 32 కి.మీ. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు..

విశాఖ సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం గోవింద నామ స్మరణతో మారుమోగుతోంది. గిరిప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గిరిప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తొలిపావంచా దగ్గర ప్రారంభమైన …

Read More »

దేశం ఖ్యాతిని పెంచిన తాపీ మేస్త్రీ కూతురు.. వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు గోల్డ్ మెడల్స్..

ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది విజయనగరం జిల్లాకు చెందిన యువతి. కడు పేదరికంలోనూ ఏషియన్ జూనియర్ వెయింట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించి దేశం ఖ్యాతిని పెంచింది. చిన్న పల్లెటూరు నుంచి అంతర్జాతీయ వేదిక దాకా సాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పేదరికంలో పుట్టిన ఆ యువతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నిలిచింది. తండ్రి తాపీ పనిచేస్తే తప్ప రోజు గడవని స్థితి నుండి దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంకు చెందిన …

Read More »

కరీంనగర్ టూ తిరుమల.? తక్కువ ఖర్చుతో నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..

మీరు కరీంనగర్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా.? కానీ ఖర్చు విషయంలో వెనకాడుతున్నారా.? అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ కోసం ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) బడ్జెట్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం.. ఐఆర్సిటిసి ప్రకటించిన ప్యాకేజీ పేరు కరీంనగర్ నుండి తిరుపతి. దీని SHR005A. ఈ టూర్ ప్యాకేజీలో  తిరుపతి, శ్రీ కాళహస్తి కవర్ అవుతాయి. అయితే ఈ టూర్ ప్రతి గురువారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ …

Read More »

ఒక్క దాడి.. తెలుగు రాష్ట్రాల మధ్య వేడి.. రాముడి భూమిలో రణరంగం..

ఏపీలో విలీనం కారణంగా… భద్రాద్రి రాముడితో పాటు భద్రాచల వాసులకూ కష్టాలొచ్చి పడ్డాయి. రోజూ పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ డంప్‌ చేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఎందుకంటే భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న నాలుగు రెవెన్యూ గ్రామాలతో పాటు ఒక పంచాయతీని ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం పట్టణాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచి, చుట్టుపక్కల ప్రాంతాలను ఏపీలో కలిపారు. అలా ఏపీలో కలిపిన ప్రాంతాల్లో ఒకటే పురుషోత్తపట్నం.. అసలు అలజడంతా జరుగుతున్నదీ అక్కడే. రెండేళ్ల క్రితం.. సరిగ్గా చెప్పాలంటే 2023 అక్టోబర్‌లో భద్రాచలం …

Read More »

4 ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులుగా పరిగణిస్తాం.. విద్యార్ధులకు కొత్త టెన్షన్

రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు జులై 7వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ కౌన్సెలింగ్‌లో స్థానికత అంశం ప్రస్తుతం విద్యార్ధుల పాలిట కొరకరాని కొయ్యలా మారింది. పదో తరగతి వరకు ఏపీలో చదివినప్పటికీ ఇంటర్మీడియట్‌ తెలంగాణలో చదివిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో స్థానికేతర కోటా చూపడంతో కొందరు తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి 2024లోనే వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానిక, స్థానికేతర రిజర్వేషన్‌ విధానంలో …

Read More »

ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌… కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్‌

ఏపీలో ఇవాళ పేరెంట్‌-టీచర్‌ మెగా మీటింగ్‌ టు పాయింట్‌ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయనున్నారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌… తల్లిదండ్రుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ల పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టుపై మాట్లాడుకోవడం… కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను గవర్నమెంట్ …

Read More »

పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీస్‌కు పిలిపించుకుని మరీ రూ.లక్ష ఎందుకిచ్చారంటే?

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన విజయ నగరం జిల్లాకు చెందిన ఓ ఇంటర్మీడియెట్ కుర్రాడిని ప్రత్యేకంగా తన ఆఫీస్ కు పిలిపించుకుని మరీ అభినందించారు. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ …

Read More »