న్యూఢిల్లీలోని ఢిల్లీ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB).. 2025-26 ఏడాదికి సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ శాఖలలో, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలలో మొత్తం 2119 టీచింగ్, మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద …
Read More »32 కిలోమీటర్ల సింహాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం.. అప్పన్న సన్నిధిలో లక్షలాది భక్త జన సంద్రం
ఈ రోజు (జులై 9) సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద నుంచి గిరిప్రదక్షిణం ప్రారంభమైంది. స్వామి వారి నమూనా విగ్రహంతో పుష్పరథం కదిలింది. రథాన్ని ఆలయ అనువంశిక ధర్మ పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. రథం వెంట లక్షలాది మంది భక్త జనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు.. గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రారక్షణ చేసిన అంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా …
Read More »సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారిందోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే!
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET 2025) జూన్ 2025 పరీక్ష తేదీ మారింది. ఈ మేరకు పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఇచ్చి షెడ్యూల్ ప్రకారం.. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు జులై 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సింది ఉంది. అయితే అదే రోజు హరియాణా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (HTET 2025) ఉన్నట్లు తేలింది. దీంతో ఒకే రోజున రెండు పరీక్షలు ఉండటంతో కొందరు …
Read More »భద్రాద్రి రామయ్య భూములపై మరోసారి రగడ.. ఈవోపై గ్రామస్థుల దాడి.. అసలేం జరిగిందంటే..
ఏపీ, తెలంగాణ మధ్య భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరింత ముదిరింది. ఏకంగా.. ఆలయ అధికారులపై దాడుల వరకు వెళ్లింది. ఎస్.. ఏపీలోని పురుషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన భూముల వ్యవహారం మరోసారి కాక రేపింది. ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని భద్రాద్రి ఆలయ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఆలయ అధికారులను పురుషోత్తపట్నం గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా …
Read More »పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే!
పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల చిన్నారి అంబటి ఖశ్వి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల వయస్సున్న అంబటి ఖశ్వి ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను …
Read More »మహిళలకు అద్దిరిపోయే శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మహిళలు ప్రయాణించవచ్చో.. కూడా చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీనిచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై …
Read More »ఫిష్ వెంకట్‌కు టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలు పంపాడంటే?
టాలీవుడ్ ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. తనదైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ప్రస్తుతం …
Read More »లార్డ్స్ మైదానంలో మూడో టెస్ట్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ.. ఆనందంతో చిందులేస్తున్న ఫ్యాన్స్
భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి లండన్‌లో ఉన్నారు. ఇటీవల ఈ స్టార్ జంట వింబూల్డన్ 2025 లో జరిగిన ఒక హై-ప్రొఫైల్ టెన్నిస్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. అక్కడ విరాట్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ కు సపోర్ట్ ఇస్తూ కనిపించాడు. మీడియా నివేదికల ప్రకారం, విరాట్-అనుష్క లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంటున్నారు. వింబూల్డన్ మ్యాచ్‌లు లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్‌లో జరుగుతున్నాయి. ఇది …
Read More »డ్రైవరన్న జర భద్రం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆ జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం!
ఎక్కువగా రోడ్డుప్రమాదాలు రాత్రి పూటనే జరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం ఒకటి డ్రైవర్స్ నిద్రమత్తు, మరొకటి మద్యం సేవించి వాహనాలు నడపడం. చాలా వరకు నిద్రమత్తు కారణంగానే రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్టాప్, రీప్రెష్ అండ్ గో అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అసలేంటి ఈ స్టాప్, రీప్రెష్ అండ్ గో.. దీన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి. రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో …
Read More »వానలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి ఇప్పుడు ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగానది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుబంధము ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు. దక్షిణ …
Read More »