ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నెలకొంది. కాంగ్రెస్ vs BRS వార్‌గా మారింది రమేష్ అనే యువకుడి ఆత్మహత్య. పోటాపోటికి నిరసనలకు పిలుపునిచ్చాయి ఇరుపార్టీలు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతున్నది. నేడు బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. BRSను అడ్డుకునేందుకు చలోములుగుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేడు మంత్రుల పర్యటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా …
Read More »టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !
భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ‘కెప్టెన్ కూల్’ ఎం.ఎస్. ధోనీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1981లో బీహార్‌లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ …
Read More »తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల వివరాలు వచ్చేశాయ్.. కాలేజీ వారీగా పూర్తి లిస్ట్ ఇదే!
తెలంగాణ ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, వాటిల్లో భర్తీ చేసే సీట్ల వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 171 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వీటిల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. వీటిల్లో కన్వీనర్ కోటా కింద దాదాపు 70 శాతం సీట్లు అంటే 76,795 సీట్లు భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక …
Read More »తెలంగాణలో నేటి నుంచి వన మహోత్సవం… ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం నేడు ప్రారంభం కానుంది. ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ, అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై మొదటి వారంలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది …
Read More »వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు… వనమహోత్సవంలో సీఎం కీలక వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ కీలకవ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందన్నారు. మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని రేవంత్ భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు. రాంజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి …
Read More »తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన
తెలంగాణలో మహిళల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల సక్షేమానికి పెద్దపీట వేస్తూ కొత్త స్టాంపు డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఈ క్రమంలో …
Read More »రేషన్ పంపిణీలో కొత్త టెక్నాలజీ.. ఫోన్‌లో ఫోటో దిగితే చాలు.. వెంటనే రేషన్!
ఇకపై రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యం కోసం గంటలు గంటలు నిలబడే అవసరం లేదు. ఎందుకంటే రేషన్ పంపిణీ వ్యవస్థలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది హిమాచల్ ప్రభుత్వం. అదే ఫేస్ అథంటికేషన్ వ్యవస్థ. ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తోంది. ఒకప్పుడు రేషన్ ఎలా తీసుకునే వాళ్లం, రేషన్ ఫాప్‌కు వెళ్లి మన దగ్గర ఉన్నరేషన్ కార్డుతో మ్యాన్‌వల్‌గా రాయించుకొని రేషన్ తీసుకునేవాళ్లాం. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఈ పాస్ యంత్రాల ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా, ఐరిస్ స్కాన్ ద్వారా …
Read More »పాండవుల మెట్ట వద్ద పాలు పొంగిస్తుండగా ఆకాశంలో అద్భుత దృశ్యం
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం జరుగుతున్న వేళ… ఆకాశంలో ఏర్పడిన వలయాకార మేఘాలు స్థానికులను ఆశ్చర్యపర్చాయి. పాలాభిషేకం కోసం పాలు పొంగించే క్రమంలోనే ఆ దృశ్యం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆకాశంలో ఏర్పడిన ఆ వలయం తేలికపాటి మేఘాలుగా ఉండటంతో… అక్కడున్న యువకులు మొబైల్ ఫోన్లలో దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆ దృశ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. ప్రతి ఏడాది రైతులు పాండవుల మెట్ట …
Read More »ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే!
రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రయాణికుల రద్దీ దృష్ట్రా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, వారికి ఇబ్బందులను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే …
Read More »సారు మా బడికి రండి! – సీఎం, డిప్యూటీ సీఎంకు స్టూడెంట్స్ లేఖలు.. ఎందుకో తెలిస్తే..
ప్రైవేట్ స్కూల్స్ తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమను ప్రభుత్వ స్కూల్‌లలో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థులు. సార్ ఒకసారి మా బడికి రండీ అంటూ ఆ ఉత్తరాల్లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం వెదుళ్ళపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల వినూత్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వ …
Read More »