తెలంగాణలోని బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు (పీయూసీ ఫస్ట్ ఇయర్) ప్రవేశాలకు సంబంధించి తొలి జాబితాను బాసర ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి గోవర్ధన్ శుక్రవారం విడుదల చేశారు. ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తొలి విడతలో 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ఈ జాబితాలో స్పెషల్ కేటగిరీ సీట్లు మినహాయించారు. తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో …
Read More »ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs) స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు. …
Read More »అంగన్‌వాడీ కేంద్రాల్లో జొన్నలతో చేసిన ఆహారం అందిచేందుకు ప్రభుత్వం కసరత్తు..!
తెలంగాణ అంగన్‌వాడీల్లో త్వరలో జొన్న రొట్టెలు, ఇతర పోషకాహారాలు అందించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక మోడల్‌ను అధ్యయనం చేసేందుకు సెర్ప్ బృందం అక్కడికి వెళ్లనుంది. మహిళా సంఘాల ద్వారా జొన్నలతో చేసిన ఆహారం సరఫరా చేయాలని కసరత్తు చేస్తోంది. అటు పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు జొన్న సాగుకు ఇది కొత్త ఊపునిచ్చే అంశం. తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం అందిస్తున్న పోషకాహారంతో పాటు జొన్నతో తయారయ్యే రొట్టె, ఇతర పదార్థాలను అందించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే …
Read More »ఇషా ఫౌండేషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి జువల్..! గ్రామీణాభివృద్ధిలో ఇషా కృషికి ప్రశంసలు..
ఇషా ఫౌండేషన్ మద్దతుతో తమిళనాడులోని గిరిజన మహిళలు ఆర్థికంగా స్వతంత్రులై, పన్నులు చెల్లిస్తున్నారు. రూ.200లతో ప్రారంభించిన వ్యాపారాలు కోట్లలో టర్నోవర్‌ను సాధించాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువెల్ ఓరం ఈ మహిళల ప్రగతిని ప్రశంసించారు. ఇషా ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఇషా ఫౌండేషన్ మద్దతుతో గిరిజన మహిళలు లక్షాధికారులుగా మారడం, ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు విక్షిత్ భారత్‌కు మార్గం సుగమం చేస్తాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సద్గురు దార్శనికతను నెరవేరుస్తాయని కేంద్ర గిరిజన …
Read More »మహా పాలిటిక్స్‌లో సూపర్ సీన్.. 20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు..
మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాకుండా ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరు అనుకుంటున్నారా..? ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిశారు. దీంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. …
Read More »ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు సూసైడ్..! ఏం జరిగిందో..?
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ.. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం …
Read More »చియా సీడ్స్ ఇలా తిన్నారంటే మీ గుండె పదిలం.. ఎనర్జీ డబుల్.. మలబద్ధకం పరార్.. !
తరచూ చియా సీడ్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. చియా సీడ్స్.. ప్రస్తుతం చాలా మంది వీటిని తమ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్నగా నల్లని రంగులో కనిపించే చియా సీడ్స్.. పుష్కలమైన పోషకాలు నిండి …
Read More »బత్తాయి పండ్లు తిన్నాక.. వీటిని పొరపాటున కూడా తినకండి..! అది విషమేనట..
బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బత్తాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కకలంగా ఉంటాయి. ఇవి.. వివిధ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. నీరసానికి గురైనప్పుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది. నీరసం దరిచేరదు. అయితే, …
Read More »ఆరేళ్ల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి.. దుండగుల కాల్పులకు బలైన బీజేపీ నేత..
ఆరేళ్ల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి.. సేమ్ టూ సేమ్.. దుండగుల కాల్పులకు బలయ్యారు. బిహార్‌లో పాట్నాలో జరిగిన కాల్పుల సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ నేత, పారిశ్రామిక వేత్త గోపాల్ ఖేమ్కాను శుక్రవారం అర్థరాత్రి దుండగుడు కాల్చిచంపాడు.. కాల్పుల అనంతరం దుండగుడు బైక్‌పై పారిపోయాడు.. గుర్తుతెలియని దుండగుడు.. ఖేమ్కా ఇంటి పక్కనే ఉన్న హోటల్ ముందు ఉండగా.. కాల్పులు జరిపాడని.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి.. ఖేమ్కా ఇంటికి వెళ్తుండగా గాంధీ మైదాన్ పోలీస్ …
Read More »9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రికార్డు స్థాయికి భారత్..!
ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారతదేశం కంటే ముందు ఉన్నాయి. భారతదేశ కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరిగాయి. భారతదేశం గత 9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు చివరకు రానే వచ్చింది. అక్టోబర్ 2024 తర్వాత మొదటిసారిగా, దేశ ఫారెక్స్ నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటాయి. జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు …
Read More »