తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్‌ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేసి.. శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా …
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …
Read More »ISSతో ఫాల్కన్-9 వ్యోమనౌక డాకింగ్ విజయవంతం.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా
అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్.. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నా భుజాలపై త్రివర్ణ పతాకం …
Read More »డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ పవర్ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు. ఇక్కడ శక్తివంతమైన సర్కార్ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉంటే.. మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ పవర్ …
Read More »వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎం …
Read More »పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?
తెలంగాణ పాలిసెట్ 2025 తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్దులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి విండో ఓపెన్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 59 ప్రభుత్వ, 57 ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో 6,703 సీట్లు, ఈఈఈలో 5,850 సీట్లు, ఈసీఈలో …
Read More »కోరిన కోర్కెలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం. ఏ దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి …
Read More »బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!
తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్‌కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. …
Read More »QR కోడ్ స్కాన్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి.. ఏమాత్రం తేడా ఉన్నా చర్యలే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు.. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది. దీని ద్వారా.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి అనే దానిపై స్పష్టత రానుంది. ఈ ఫారమ్‌లో పౌరులు ఇవ్వవలసిన ప్రశ్నలు/అభిప్రాయాలు ఇలా ఉంటాయి.. …
Read More »శివయ్యా ఇన్నాళ్లకు కరుణించావా..! శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం – ఎప్పటి నుంచి అంటే
శైవ భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం దేవస్థానం. రోజుకు 1000 మంది చొప్పున శ్రీశైలంలో వెలసిన జ్యోతిర్లింగ స్పర్శ దర్శనానికి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సదావకాశం గతంలో ఉన్నదే అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యలో బంద్ చేశారు. తర్వాత మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభిస్తున్నారు. ప్రతివారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లోనే ఈ స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే ఈ స్పర్శ దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల …
Read More »