Kadam

పోలీస్ ఆఫీస్ ఎదుట సూర్య నమస్కారాలు..ఆకట్టుకుంటున్న శిల్పాలు.. ఆవిష్కరించిన ఎస్పీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపిలో ప్రతి చోట యోగాసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వినూత్న ఆలోచనకు రూపం వచ్చింది. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖాళీ స్థలం ఉంది ఎంతో కాలంగా అక్కడ మట్టి పేరుకుపోయి ఉంది. అయితే ఎస్పీ సతీష్ కుమార్ అక్కడ అరుదైన శిల్పాక్రుతిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.పోలీసులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రతి రోజూ డ్రిల్ చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా ప్రతి రోజూ లా అండ్ …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితరచూ ఎదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇటీవల హుజురాబాద్‌కు చెందిన ఓ గ్రానైట్‌ వ్యారిని బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేశాడని బాధితులు సుబేదార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. అతని ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిని …

Read More »

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఆయనకు పోన్‌ చేసిన సిట్‌ అధికారులు.. గత బీఆర్ఎస్ హాయాంలో మీ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయ్యిందని..ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం తీసుకునేందుకు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా.. ఎందుకంటే!

వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే ఇటీవల భ‌ద్రకాళి అమ్మవారి బోనాల‌కి సంబంధించి కొంత‌ మంది నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు.. పలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఈ విషయంపై త‌ప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా, ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను.. పవిత్రమైన అమ్మవారికి …

Read More »

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం

సురేందర్, నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆర్మీ, బీఎస్ఎఫ్ లో చేరాలనే కలతో ఉన్నాడు. అయితే ఆ కల నెరవేరకపోవడంతో, ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో శిక్షణ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అతని కృషికి ముఖ్యమంత్రి కూడా అభినందనలు తెలిపారు.ఆర్మీలో చేరాలనుకున్నా.. అదృష్టం వరించలేదు. బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం చేయాలనుకున్నా.. కాలం కలిసిరాలేదు. అయినా ఏదో సాధించాలనే తపన ఆ యువకుడిలో ఏమాత్రం తగ్గలేదు. అనూహ్యంగా రైఫిల్‌ షూటింగ్‌ రంగాన్ని ఎంచుకుని.. …

Read More »

కొట్లాడితే ఏమొస్తుంది.. కూర్చుని మాట్లాడుకుంటే పోలా.. బేసిన్‌లో నీళ్లకు భేషజాలు ఎందుకు?: సీఎం రేవంత్

కొట్లాడుకుంటే ఏమొస్తుంది? కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోద్ది కదా. బేషజాలకు పోతే ఏమొస్తుంది. బేసిన్ల లెక్కలు తేల్చుకోవడమే కదా కావాల్సింది. రండి.. మాట్లాడుకుందాం.. నీటి వాటాలపై క్లారిటీకి వద్దామంటూ.. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ ఏదైనా ఉందంటే.. అది జల జగడమే. గోదావరి, కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో మొదటి నుంచీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏపీ బనకచర్ల ప్రతిపాదనతో జల జగడం మరింత ముదిరింది. ఈ ప్రాజెక్ట్‌తో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి …

Read More »

యోగా.. యావత్ భారతావనికి దక్కిన గౌరవం.. యోగా సాధకులు మాత్రమే ఒత్తిడిని జయించగలరు- పవన్ కల్యాణ్‌!

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం యోగాలో పాల్గొనే వారి కోసం ఆర్కేబీచ్‌ నుంచి భీమిలి వరకు అనే కంపార్ట్‌మెంట్స్‌ ఏర్పాటు చేసింది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇక ఈ …

Read More »

రికార్డులు ఏవైనా మోదీకే సాధ్యం.. యోగా మన జీవితంలో భాగం..

11వ అంతర్జాతీయ యోగాడే రికార్డు నెలకొల్పబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 12 లక్షల ప్రాంతాల్లో ఇవాళ యోగా చేస్తున్నారన్నారు. అలాగే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంతో రికార్డు సృష్టించినట్టు చెప్పారు. నిన్న 22వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డు సాధించారన్నారు. ప్రతిరోజూ గంటసేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. …

Read More »

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది..! యోగాంధ్ర 2025లో ప్రధాని మోదీ

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసి.. యోగాంధ్రలో పాల్గొన్నారు. విశాఖలోని INS చోళ నుంచి ఆర్కే బీచ్‌ దగ్గరకు చేరుకున్న మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తోపాటు మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “యోగా ప్రపంచాన్ని కలిపింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం …

Read More »

ఇది కదా మోదీ దౌత్యం అంటే.. భారత విమానాలకు మాత్రమే ఎయిర్‌ స్పేస్‌ తెరిచిన ఇరాన్‌!

ఇజ్రాయెల్‌తో యుద్దం వేళ ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క భారతీయ విమానాలను మాత్రమే తమ దేశ గగనతలంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. భారతీయ విమానాలకు ఇరాన్ ఎయిర్‌ స్పేస్‌ తెరిచింది. దీంతో మూడు భారతీయ విమానాలు ఇరాన్‌కు బయలుదేరుతున్నాయి. ఆపరేఫన్‌ సింధూను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1000 మంది విద్యార్ధులను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 120 మంది భారతీయ విద్యార్ధులను కేంద్రం స్వదేశానికి తరలించింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులకు భూమార్గం మీదుగా అర్మేనియా తీసుకొచ్చి అక్కడి నుంచి …

Read More »