Kadam

త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వైఫై…!

త్వరలో తెలంగాన ఆర్టీసీ బస్సుల్లో వై-ఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ఢిల్లీకి చెందిన ప్రైవేటు సంస్థ, బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో ముందుగా అప్‌లోడ్ చేసిన సినిమాలు, పాటలు అందించడంపై ప్రతిపాదనలు చేసింది. వాటి మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పంచుకోనే విధానంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది.ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కార్.. తాజాగా బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది. త్వరలో …

Read More »

ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లొకేష్‌ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు.ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ రాష్ట్రానికి సంబంధించిన …

Read More »

చిరుధాన్యాల్లో మోదీ యోగాసనాలు.. కళా రూపానికి జీవం.. చూస్తే ఔరా అనాల్సిందే..!

యోగాను విశ్వవ్యాప్తం చేసి.. ప్రపంచ దేశాలు భారత వైపు చూసేలా చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు యోగాను జీవితంలో భాగం చేసి విశాఖ వేదికగా మరో రికార్డు సృష్టించబోతున్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రికార్డు నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ.. విశాఖకు చెందిన కళాకారుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రధాని మోదీ మెచ్చిన యోగాతో పాటు.. ప్రధాని నచ్చిన ఆహారమైన చిరుధాన్యాలతో చిత్ర పటాలను వేశాడు. అదీ కూడా మోదీ యోగాసనాలతో అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించాడు. కలర్స్‌తో …

Read More »

 వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు

అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖ ఐటీ హబ్‌ను బలోపేతం చేయడానికి రూ. 1500 కోట్ల పెట్టుబడితో మెగా టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకుగానూ సదరు కంపెనీకి 22 ఎకరాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీగా ఎకరానికి 99 పైసలు మాత్రమే తీసుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 8000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.విశాఖ నగరం ఐటీ రంగంలో మరో మెట్టు ఎక్కనుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఇప్పుడు విశాఖను తన …

Read More »

శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ – అక్కడ ప్రయాణం పూర్తి ఉచితం

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల అరికట్టడం, కాలుష్య నియంత్రణకు ఉచిత బస్సులు చారిత్రకమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు శ్రీవారి ధర్మ రథాల మార్గంలో ప్రతి రెండు నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల ద్వారా తిరుమలలో భక్తుల రవాణా మరింత సౌకర్యవంతం కానుంది.తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ద్వారా ఉచిత స‌ర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీటీడీ అద‌న‌పు …

Read More »

ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ – తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. …

Read More »

కృష్ణమ్మ ఒడ్డున జల యోగాసనాలు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు!

యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో 188 మందితో జల యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలతో నీటిపై తేలియాడుతూ ప్లవని ప్రక్రియతో వృక్షాసనం, శవాసనం, పద్మాసనం, వాయుదిగ్బంధనం తదితర ఆసనాలతో విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు. అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ (అవారా) ఆధ్వర్యంలో రింగ్ సాయంతో చిన్నారుల ఆసనాలు, నాగాయలంక ఈత మిత్రులు, బావదేవరపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఊపిరిని నియంత్రిస్తూ నీటిలో వివిధ …

Read More »

కేసీఆర్ ప్రభుత్వం, షర్మిలమ్మ పోన్ ట్యాప్ చేసిందా..? వైఎస్ జగన్ తొలి స్పందన ఇదే!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్‌, జగన్‌ కలిసే ఆ ఇన్ఫర్మేషన్‌ను షేర్‌ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను ట్యాప్‌ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల …

Read More »

ఆ దేశ ప్రధానికి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ..! ఎందుకంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా పర్యటనలో ఉన్నారు. క్రొయేషియాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రొయేషియా అధ్యక్షుడు, ప్రధానమంత్రికి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విలువైన హస్తకళలను బహుమతిగా ఇచ్చారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిశా నుండి పట్టచిత్ర పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్ నుండి వెండి కొవ్వొత్తి స్టాండ్‌ను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రపతికి ‘పట్టచిత్ర పెయింటింగ్’ క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్ కు ఒడిశా నుంచి వచ్చిన సాంప్రదాయ పట్టచిత్ర పెయింటింగ్ ను ప్రధాని మోదీ …

Read More »

అయ్యో భగవంతుడా.. ఇదేంటయ్యా..! చనిపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చినట్లు సమాచారం..

భవిష్యత్‌పై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు.. పోలీస్ అవ్వాలని.. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమై.. సక్సెస్ అయ్యాడు.. సీఆర్‌పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు.. మరికొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయనగా.. ఇంతలోనే విధి వంచించింది.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ (22) అనే యువకుడు …

Read More »