Kadam

ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేష్ కీలక భేటి.. ఎందుకంటే.?

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. …

Read More »

ఇంటర్‌ సప్లిమెంటరీ మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 50.82 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా.. ఇందులో 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 17 నుంచి జూన్‌ 23వ …

Read More »

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు! పరుగులు తీసిన సిబ్బంది

హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా వచ్చింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, CISF, ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాన్ని ఖాళీ చేసి, బాంబు నిర్మూలన బృందం తనిఖీలు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది.ఇటీవలె అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో.. ప్రజల్లో విమానం పేరు వింటేనే భయం కలుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. …

Read More »

నిర్మలా సీతారామన్ AI వీడియోతో భారీ స్కామ్‌! రూ.20 లక్షలు మోసపోయిన లేడీ డాక్టర్‌

హైదరాబాద్‌లోని ఓ వైద్యురాలు ఏఐ సాయంతో జరిగిన సైబర్ మోసానికి బలి అయ్యారు. నకిలీ వీడియోలు, లింకుల ద్వారా ఆమెను రూ.20 లక్షల రూపాయలు పోగొట్టారు. నిర్మలా సీతారామన్ గారి పేరుతో ఉన్న నకిలీ వీడియోను చూపించి నమ్మించి మోసం చేశారు.సైబర్ మోసాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, కేంద్రం నుంచి ఎన్ని సూచనలు సలహాలు వచ్చినా అవేమి పట్టించుకోకుండా బాధితులు మోసపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ ఫ్రాడ్ అంటూ వివిధ రకాలుగా సైబర్ నేరస్థులు ప్రజలను బురిడీ కొట్టించి …

Read More »

GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త రికార్డు!

మే నెలలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది.అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాదిమంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక …

Read More »

తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఆరో తరగతి ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 పాత విద్యాలయాలుండగా వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిల్లో ఆరో తరగతి ప్రవేశాలు …

Read More »

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్ లీగల్‌ నోటీసులు.. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ..

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించడం కాక రేపుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు మహేష్‌కుమార్‌గౌడ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి.ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్‌కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు …

Read More »

సైబర్‌ మోసాలపై అప్రమత్తం కండి.. అలాంటి లింక్స్‌ను క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో తన బ్యాంక్‌ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..ఇటీవల కాలంలో …

Read More »

కుప్పం బాధిత మహిళకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిన సీఎం.. ఆర్థిక సాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్!

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన ఘోరమైన అమానవీయ ఘటనపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. అప్పు తీర్చలేదని ఒక మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి దారుణంగా అవమానించిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. స్వయంగా తానే బాధిత మహిళకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సమాజంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి …

Read More »

తిరుపతి విమానాశ్రయానికి పేరు మార్పు..? కేంద్రానికి టీటీడీ సిఫార్సు..

తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్రయం పేరు మారబోతుందా? అంటే నిజమనిపిస్తుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పేరు సిఫార్సు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపింది. ఇక నుంచి రేణిగుంటను శ్రీ వేంక‌టేశ్వర అంత‌ర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంపై టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు చర్చించి తీర్మానం చేసింది. కేంద్ర పై ఒత్తిడికి ప్రయత్నిస్తోంది. తిరుమ‌ల‌కు ఐకానిక్‌గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర విమాన‌యాన శాఖ‌కు టీటీడీ సిఫార్సు చేసింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం(జూన్ 17) జరిగిన …

Read More »