Kadam

కీలక మలుపు తిరిగిన కాలేశ్వరం విచారణ..! మంత్రులతో సీఎం రేవంత్‌ మీటింగ్‌

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన మలుపు తిరిగింది. కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల నిమిత్తాలను అందించాలని కోరింది. నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చర్చించి అధికారులకు అన్ని వివరాలు కమిషన్ కు అందించాలని ఆదేశించారు.కాళేశ్వరం కమిషన్‌ విచారణ కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌, ఈటలను …

Read More »

పాలకొల్లులో ఆవుల కోసం గరుకు స్తంభాల ఏర్పాటు.. ఈ గరుకు స్తంభం విశిష్టత ఏమిటంటే..

మనిషికి దురద పుడితే ఏం చేస్తారు చేతితో గోకుతారు. వీపు భాగం లో ఐతే పుల్ల తోనో మరేదైనా వస్తువునో ఉపయోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా వెదురుతో చేసిన వస్తువులు సైతం మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. మరి ఇదే కష్టం ఒక నోరులేని జీవికి వస్తే అది యెంత వేదనకు గురి అవుతుంది. సాధ్యమైనంత వరకు తనకు తాను శరీరానికి కలిగిన అసౌకర్యాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆవుకి ఉండే గంగ డోలుకి దురద కలిగితే.. తీర్చుకునేందుకు గరుకు స్థంభాలను ఏర్పాటు …

Read More »

అడ్డొస్తే తొక్కేస్తారా.. ఎవర్ని తొక్కుతారు? ఇక్కడుంది CBN..! సీఎం చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, అడ్డుకుంటే తొక్కేస్తామని ప్లకార్డులు ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ను “నాటకాల రాయుడు” అని పిలుస్తూ, ఆయన రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పొదిలి టూర్‌ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్‌ ఇచ్చారు. అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో …

Read More »

యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఆర్కె బీచ్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్‌ నుంచి రుషికొండ వరకు జరుగుతున్న యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహణతో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 3లక్షల 40వేల మందితో ఒకే ప్రాంతంలో యోగా నిర్వహించిన 22 ఐటమ్స్‌లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నామని.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిగమించబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి. …

Read More »

ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్‌లో తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కాశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు.  ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని అక్కడి స్థానికులు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ మూతపడ్డాయి. భద్రతా చర్యల కారణంగా మూసివేసిన పర్యాటక ప్రాంతాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ తెరిచింది. దాదాపు రెండు నెలల …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!

రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యూకేషన్‌లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 210 స్కూల్స్ తో పాటు మరిన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అంటారు. కానీ …

Read More »

ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య – పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత, దానిలో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పీయూష్ గోయల్‌ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఈ పరిణామంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు వినియోగించే హెలికాప్టర్లలో సాంకేతిక, భద్రతా సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై అసలు ఆ హెలికాప్టర్‌ వాడొచ్చా లేదో వివరణ ఇవ్వాలన్నారు.

Read More »

గోదాంలో రేషన్ బియ్యం బస్తాలు సీజ్.. కట్ చేస్తే.. తెల్లారి రెవెన్యూ అధికారులు లెక్కపెట్టగా..

కర్నూలు జిల్లా ఆదోనిలో సిరిగుప్ప రోడ్డులోని గోదాములో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు సివిల్ సప్లై డైరెక్టర్ దృష్టికి వచ్చింది. ఆ వెంటనే మహేష్ నాయుడు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. 1800 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. సీజ్ చేయాలని సూచించి డైరెక్టర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయమే 1800 బస్తాలకు బదులు కేవలం 109 బస్తాలు మాత్రమే సీజ్ చేసినట్లు రెవెన్యూ పోలీస్ అధికారులు …

Read More »

జాగ్రత్త.. ఈ ఐదురకాల ఆహారపదార్థాలతో క్యాన్సర్ ముప్పు!

ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ప్రాథమిక స్థాయిలో కూడా దీని లక్షనాలు గుర్తించడం చాలా కష్టమైపోతుంది. దీని వలన చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే క్యాన్సర్ పట్ల ప్రత్యేక అవగాహన కలిగి ఉండటమే కాకుండా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదంలో కీలక పాత్ర ఆహారందే ఉండటం వలన కొన్ని …

Read More »

రెండు విడతల్లో కుల-జనగణన.. గెజిట్ విడుదల.. ఎప్పటివరకు వరకు పూర్తవుతుందంటే..

15 ఏళ్ల తర్వాత దేశంలో జన గణన జరగనుంది. దీనికి సంబంధించింది కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1948 జనాభా లెక్కల చట్టం (1948లో 37)లోని సెక్షన్ 3 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ జనగణన చేపట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రెండు విడుతల్లో జన గణన జరగనుంది. 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో జన గణన ప్రక్రియ ముగియనుంది. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జన గణన …

Read More »