Kadam

తెలంగాణలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్‌

మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేసీఆర్, కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న వేళ.. రాజకీయంగా తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ మంత్రులతో సీఎం సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల …

Read More »

నీట్‌-యూజీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగోళ్లు.. టాపర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికాల్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-యూజీ 2025 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 పర్సంటైల్ స్కోరుతో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్‌ సాధించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా 99.9999095 పర్సెంటేల్‌తో సెకండ్ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి 99.9998189 పర్సెంటేల్‌తో థార్డ్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. అమ్మాయిల్లో ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్‌ 5వ …

Read More »

 తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. 

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫప్ట్, సెకండ్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం (జూన్ 16) విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్ధులతోపాటు మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసిన వారికి కూడా ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in  లేదా results.cgg.gov.inలలో విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Read More »

సర్కార్ బడుల్లో చదివే పేదింటి పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం యేటా మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..కేంద్ర ప్రభుత్వం యేటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత …

Read More »

రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్.. ఏపీ ప్రజలకు హెచ్చరిక

రుతు పవనాల ప్రభావంతో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నెల 20 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వానలు పడుతున్నాయి.దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. దీని …

Read More »

జనావాసంలో చిరుత హల్ చల్.. రైతుకి తీవ్ర గాయం.. అటవీ శాఖ నిర్లక్షంపై మండిపాటు..

అడవుల్లో నుంచి జనావాసంలోకి వచ్చిన చిరుత పులి హల్చల్ చేసింది. చిరుతను బంధించేందుకు రైతులు పడిన కష్టమంతా అంతా కాదు. చివరకు ఓ రైతుపై చిరుత పంజా విసిరింది. తీవ్ర గాయం కావడంతో రైతులంతా ఏకమై చిరుతను వలలో బంధించారు. ఇదంతా గమనిస్తున్న రైతులు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.కర్నూలు జిల్లా కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుత పులి కనిపించింది. అనారోగ్య సమస్యతో …

Read More »

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న టైమింగ్..

డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ, భారతదేశంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తూ, కోట్లాది మంది ప్రజల ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు మరో శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో, జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా, సమర్థవంతంగా జరగనున్నాయి. ఈ మార్పులు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు జరిపే వారికి …

Read More »

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, ఈ ఏడాది రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటంటే..

రక్తదానం చేయండి.. ప్రాణదాత కండి ఈ నినాదం గురించి అందరికీ తెలిసిందే. రక్తదానాన్ని గొప్ప దానంగా భావిస్తారు. ఒక యూనిట్ రక్తంముగ్గురు జీవితాలను కాపాడుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన ప్రాణం కాపాడడమే కాదు.. ఆరోగ్యానికి కూడా లాభం. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే.. అది రోగి జీవితానికి ప్రాణాంతకం కావచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.ప్రస్తుతం అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. శరీరంలో తగినంత రక్తం …

Read More »

పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

కొన్ని పచ్చి ఆహారాలు శరీరానికి హానికరం. వీటిని పచ్చిగా తీసుకుంటే ప్రమాదమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లు శరీరానికి హాని కలిగిస్తాయి. వాటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బటన్ పుట్టగొడుగుల వంటి కొన్ని పుట్టగొడుగులను పచ్చిగా …

Read More »

డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. మార్క్రామ్ కీలక ఇన్సింగ్స్‌తో 27 ఏళ్ల కల సాకారం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా అందించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా, ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీల్లో బ్యాడ్ లక్ ముద్రను చెరిపేసుకుంది. ఈ విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ (136) నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (66)తో కలిసి 147 పరుగుల కీలక భాగస్వామ్యంతో 27 ఏళ్లను సుగమం చేశాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. శనివారం సౌతాఫ్రికా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా మొదటిసారి …

Read More »