తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల …
Read More »కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్ 1న …
Read More »మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో …
Read More »కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్
తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి …
Read More »కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. జర జాగ్రత్త..! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..
కనుమరుగై పోయిందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే.. జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో …
Read More »అక్రమ మైనింగ్ కేసులో ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై సొమవారం ఉదయం వేగంగా వచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా మరొకరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కారు, లారీ ఢికొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పుగోదావరి …
Read More »నైరుతి రుతుపవనాల రాక.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
కేరళా తీరాన్ని తాకిన నైరుతు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా …
Read More »దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి.. భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్!
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ఈ వ్యవస్థ రూపొందించింది. గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇది ఫిక్స్ చేసిన టార్గెట్‌లను విజయవంతంగా చేరుకుందని అధికారులు వెల్లడించారు.భార్గవాస్త్ర అనేది సూక్ష్మ క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ సిస్టమ్, ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ బార్గవాస్త్ర రక్షణ రంగంలో …
Read More »నేడు కాకతీయ వాసరత్వ సంపద, శిల్పాకళ సందర్శనకు అందగత్తెలు.. వాహ్ వరంగల్ అనేలా ఏర్పాట్లు.
కాకతీయుల వారసత్వ సంపద, శిల్పకళా వైభవాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు.. ప్రపంచ సుందరీమణుల సందర్శన కోసం కాకతీయ శిల్ప సంపదకు నిలయమైన రామప్ప ఆలయం, వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. అందగత్తెలు అబ్బురపోయేలా వాహ్ వరంగల్ అనేలా ఆ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు ఇప్పుడు నయా లుక్ తో వెలిగి పోతున్నాయి..వరంగల్ జిల్లాలో ఈ రోజు ప్రపంచ అందాల సుందరిమణులు రెండు టీములుగా పర్యటించనున్నారు.. గ్రూపు- 1 టీమ్ లో22 మంది, గ్రూప్-2లో 35 మంది …
Read More »