Kadam

పెద్దన్న దారిలో బ్రిటన్.. అక్రమ వలసలపై ఉక్కుపాదం.. ఇండియన్సే టార్గెట్..!

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే అక్రమ వలసదారులపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతోంది. పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తమ దేశ సైనిక విమానాల్లో ఎక్కించి పంపుతోంది అమెరికా అధికార యంత్రాంగం. దీనిపై చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్ కూడా అక్రమ వలసల ఏరివేత కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేపడుతుండటం వెలుగులోకి వచ్చింది. మురీ ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూ..రెండేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘డంకీ’ అందరికీ గుర్తుండే …

Read More »

వీరరాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..

దేవుడి పేరు చెప్పి దందాలు చేసే బ్యాచ్‌లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయ్.. ఇలాంటి వాళ్లలో వీరరాఘవరెడ్డి తీరు వేరే లెవెల్‌..! ఇతని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.మ్యూజిక్‌ టీచర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన వీరరాఘవ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం తన ప్లాన్ అమలు చేసేందుకు ప్రైవేట్‌ ఆర్మీని రెడీ చేసుకున్నాడు.. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి మొదటి స్లాట్‌లో 5 …

Read More »

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో భారత్‌ దూకుడు.. గ్లోబల్‌ లీడర్‌ చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం

AI టెక్నాలజీలో భారత్‌ను గ్లోబల్‌ లీడర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. పారిస్‌లో జరుగుతన్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ దీనిపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించబోతున్నారు. AI టెక్నాలజీని సామాన్యుడికి కూడా చేరేవిధంగా కేంద్రం కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో భారత్‌ దూసుకెళ్లోంది. AI రంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్యుడికి కృత్రిమ మేథ ఫలాలను అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీ పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత …

Read More »

స్కూల్‌కి వచ్చి బాలుడ్ని కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

బాలుడ్ని గుర్తు తెలియని ఆగంతకులు తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అలసు బాలుడ్ని తీసుకెళ్లింది ఎవరు.. మళ్లీ ఎందుకు వదిలేశారు… పోలీసుల గురించి భయపడి వెనక్కి తగ్గారా..? ఈ కేసులో అన్నీ మిస్టరీలే ఉన్నాయి. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్థానిక భాష్యం స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పరమేష్ కిడ్నాప్‌కి గురయ్యాడు. ప్రతి రోజులానే పరమేష్ …

Read More »

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేల శ్రీశైలం వచ్చే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్

శివరాత్రి సమయంలో మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మంత్రులు శ్రీశైలం వచ్చి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. మహాశివరాత్రి అంటే శివ భక్తులంతా భక్తి పారావస్యంతో మునిగితేలుతారు. అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే ఇక భక్తులకు పండగే. ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంకి భక్తులు తరలివస్తారు. ఎందుకంటే శక్తి పీఠాలలో జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది. అంతేకాదు ఒకే చోట శక్తి పీఠము …

Read More »

ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్న జిల్లా కలెక్టర్.. ఏకంగా 31 మందికి షోకాస్ నోటీసులు..!

సంకేతాలు పెట్టి ఎక్కడకు వెళ్లారు.. ఎందుకు వెళ్లారని వివరాలు సేకరించిన కలెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై తన మార్కు చూపించారు. వివిధ విభాగాలలో కలిపి మొత్తం 31 మంది రిజిస్టర్ల సంతకం పెట్టుకుని పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లిన వారికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. సమయపాలన పాటించని అధికారుల పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారుజనగామ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకకాలంలో 31 మంది కలెక్టరేట్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ఎంక్వయిరీ..!

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై పునర్విచారణకు ఆదేశించింది. ఐదు రోజుల్లో సర్వే చేసి.. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆర్డర్స్‌ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసింది. గత ప్రభుత్వ …

Read More »

వెర్రితలలు వేస్తున్న ‘విలనిజం’.. పాతికేళ్ల కుర్రాడి నుంచి యాభై ఏళ్ల బామ్మదాకా..!

మాయమైపోతున్నాడమ్మ..మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ కవి ఈ స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. నిజమే.. మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. క్షణికావేశంలో, అనుమానపు పొరల్లో, పేగుబంధాన్ని సైతం చూడలేని కర్కశత్వంతో ప్రవర్తిస్తున్నాడు మనిషి. సమాజంలో ఈ పోకడలు కారణాలేంటో చెప్పుకుందాం..చిన్నప్పుడు ఎత్తుకుని చాక్లెటిచ్చిన తాతకు.. కసితీరా కత్తిపోట్లు, ఇంటికి రాగానే ఆప్యాయంగా అన్నం పెట్టే ఇల్లాలికి రోకటిపోటు.. ముద్దుముద్దుగా అమ్మా, నాన్నా అని పిలిచే కన్నపేగుకు ఒంటిపై అక్రమ సంబంధాల వాతలు..! ఏరా సిట్టింగ్‌కు రెడీయా …

Read More »

ఏపీలో బర్డ్ ప్లూ నిర్ధారణ.. మరి చికెన్ తినొచ్చా…?

ఏపీలో పౌల్ట్రీ ఇండస్ట్రీని అల్లాడిస్తున్న వైరస్‌ని బర్డ్‌ఫ్లూగా తేల్చారు. చూస్తుండగానే వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కోళ్లఫారాలున్న అన్ని చోట్లా హైఎలర్ట్‌ ప్రకటించారు..! రెండు ఫారాల్లోని కోళ్ల మృత్యువాత బర్డ్ ప్లూ కారణంగానే అని తేలడంతో.. ఆ ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణమని ల్యాబ్‌ టెస్ట్‌లలో నిర్ధారణయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు

ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ మినహా మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో బీరు ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు వచ్చాయి.రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రాథమిక ధర (బేసిక్ ప్రైస్)ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని బ్రాండ్ల …

Read More »