ఆహాలో మళ్లీ బాలయ్య సందడి.. ఇక అన్ స్టాపబుల్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, ఓటీటీలో షోలు అంటూ బాలయ్య దుమ్ములేపేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలోని రెండో కోణాన్ని అన్ స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసింది. బాలయ్య ఎంత అల్లరి చేస్తాడు.. అందరితో ఎంత సరదాగా ఉంటాడు అన్నది అందరికీ అర్థమైంది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికి రెండు సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్‌కు మంచి ఆదరణ దక్కింది.

ఇక ఇప్పుడు కొత్త సీజన్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బాలయ్య మరోసారి ఆహాలో సందడి చేయబోతోన్నాడు. ఈ సారి కూడా పొలిటికల్ గెస్టుల్ని తీసుకొచ్చేలా ఉన్నాడు. అసలే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో బాలయ్య సినీ, పొలిటికల్ టచ్‌తో ఈ సీజన్ రఫ్పాడించేలా ఉన్నాడు. గత సీజన్‌లో బాలయ్యతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ షోలో సందడి చేశారు.

మహేష్ బాబు బాలయ్య ఎపిసోడ్, ప్రభాస్‌తో బాలయ్య పెట్టిన ముచ్చట్లు బాగానే హైలెట్ అయ్యాయి. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ల టైంలో అయితే ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది. అంతలా జనాలు ఎగబడి ఆ సీజన్లను చూశారు. ఇండియాలో అన్ స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు బాలయ్య మరోసారి అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సారైనా చిరంజీవి, బాలయ్య ఎపిసోడ్ వస్తుందేమో చూడాలి. వీరిద్దరి ఎపిసోడ్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు. కానీ ఇంత వరకు అది సాధ్యపడలేదు. ఆహా టీం తనని సంప్రదించలేదని, అడిగితే ఎపిసోడ్ చేస్తానని చిరంజీవి ఆ మధ్య ఓ సారి చెప్పుకొచ్చాడు. మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. అసలే ఈ సారి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్‌ను తన షోలో బాలయ్య ఎలా చేస్తాడో చూడాలి.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *