గచ్చిబౌలిలో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్యూటీషియన్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడిచేసి.. ప్రాణాలు తీశాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులు గాయపడ్డారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నిందితుడు రాకేశ్, మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు.

పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ (25) అనే యువతి నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె గోపన్‌పల్లి తండా సమీపంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కొంతకాలం కిందట దీపనతో రాకేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో కొన్నాళ్లు ఇద్దరూ కలిసి తిరిగారు. అయితే, ఇటీవల రాకేశ్‌ను దూరం పెట్టడంతో కోపంతో రగిలిపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతుంటే.. అతడి ప్రతిపాదనకు దీపన నిరాకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేశ్.. ఆమెతో గొడవపడ్డాడు.

దాడి అనంతరం అక్కడి నుంచి పరారైన రాకేశ్.. మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. ఓ విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించి షాక్‌కు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బ్యూటీషియన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

About amaravatinews

Check Also

కొమురంభీమ్‌ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి

అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *