దిగ్గజ సంస్థల బంపరాఫర్.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. దానిపై రూ. 96 వేలు తగ్గింపు!

Honda Amaze Price: హోండా కార్లు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. సంస్థ వేర్వేరు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగస్టు నెలలో మంత్‌లీ డిస్కౌంట్ స్కీంలో భాగంగా ఇతర ఇన్సెంటివ్స్‌తో కలిపి వివిధ వేరియంట్ల ధరల్ని తగ్గించింది. ఈ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం.. ఇప్పుడు హోండా ఎలివేట్ SUV, హోండా సిటీ, హోండా అమేజ్ సెడాన్‌లపై ఆగస్టు చివరివరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా దీనితో పాటుగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని.. ఆ వేడుకల్లో భాగంగా ఆగస్టు నెలలో కొనుగోలు చేయాలనుకున్న ఏదైనా మోడల్‌పై ఇతర అదనపు ప్రయోజనాల్ని కూడా కల్పిస్తోంది. దీంట్లో ఆగస్టులో ఏయే వేరియంట్లపై ఏమేం ఆఫర్లు ఉన్నాయనేది తెలుసుకుందాం.

హోండా ఎలివేట్ ఎస్‌యూవీపై ఆగస్ట్ నెలలో డిస్కౌంట్ రూపంలోనే రూ. 65 వేల వరకు ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాకు పోటీగా ఉన్న ఈ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్, లోయాల్టీ బోనస్ కింద ఇంత తగ్గింపు ప్రకటించింది. మరోవైపు అదనపు బెనిఫిట్స్ కింద.. 3 సంవత్సరాల వరకు ఉచితంగా మెయింటెనెన్స్ సర్వీస్ అందిస్తున్నట్లు వెల్లడించింది. హోండా ఎలివేట్ మొత్తం 4 వేరియంట్లలో ఉంది. SV, V, VX, ZX. ఇక బేస్ ఎస్వీ వేరియంట్ మినహాయించి మిగతా అన్నింట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. దీని ధరల శ్రేణి రూ. 11.58 లక్షల నుంచి రూ. 16.20 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూం ధరలు.

హోండా కార్లలో చిన్న కార్లుగా పేర్కొ్నే హోండా అమేజ్‌పై అయితే ఏకంగా రూ. 96 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. అమేజ్ సెడాన్‌పై ఇది వర్తిస్తుంది. ఇది మారుతీ డిజైర్, హ్యుందాయ్ అరాకు పోటీగా ఉంది. ఇది ఈ నెలాఖరు వరకు వర్తిస్తుంది. ఇక్కడ కూడా మూడేళ్లు మెయింటెనెన్స్ ఛార్జీలు ఉండవు. ఇది 1.2 పెట్రోల్, 1.5 డీజిల్ యూనిట్‌తో వచ్చింది. వీటి ధరలు ఎక్స్ షోరూంలో చూస్తే రూ. 7.93 లక్షల నుంచి రూ. 9.86 లక్షల మధ్య ఉన్నాయి.

ఇక హోండా సిటీ కార్లలో సిటీ, సిటీ హైబ్రిడ్ సెడాన్స్ మోడళ్లపై ఆగస్టులో రూ. 90 వేల వరకు తగ్గింపు ఉంది. ICE- ఓన్లీ వెర్షన్ సెడాన్‌పై రూ. 88 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇక్కడ కూడా అన్ని రకాల తగ్గింపులు వర్తిస్తాయి. ఇది ఫోక్స్‌వ్యాగన్ వర్చస్, స్కోడా స్లేవియా, హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి పోటీగా ఉంది. దీని ప్రారంభ ధర రూ.12.08 లక్షలుగా ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ సెడాన్ గరిష్ట ధర రూ. 20.55 లక్షల వరకు ఉంది. ఇది కూడా నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది.

About amaravatinews

Check Also

రైతులకు శుభవార్త.. ఈనెల 24న పీఎం కిసాన్‌ డబ్బులు.. వీరికి మాత్రం రావు!

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 24న పీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *