Honey Facts : తేనెని ఇలా తీసుకుంటే విషంతో సమానమట

మనందరికీ తెలుసు తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయని. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తేనెని సరిగ్గా ఎలా తినాలనేది. కొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకుంటే ఎంత మంచిదో.. మరికొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలొస్తాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తేనెని అలానే తీసుకోవచ్చు. అయితే, ఎంత తినాలనే పరిమితి మాత్రం తెలిసి ఉండాలని అ. దే విధంగా.. నట్స్‌తో తినడం కూడా చాలా మంచిది. వాల్నట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటి నట్స్‌తో తేనె కలిపి తినడం వల్ల టేస్టీగా ఉంటాయి. రెండింటి కలయిక ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.’

నిజంగానే. పండ్లతో తేనె కలిపి తినడం కూడా చాలా మంచి అలవాటు. సిట్రస్ ఫ్రూట్స్‌తో కాకుండా మాములగా మీరు తినే పండ్లని తేనెతో కలిపి తిని చూడండి. ఆ రెండి కాంబినేషన్‌కి మీరు ఫిదా అయిపోతారు.

ఓ బౌల్‌లో కార్న్ ఫ్లేక్స్ వేసుకుని అందులో హనీ వేసుకుని తతినండి. ఉదయాన్నే తింటే మంచి బ్రేక్‌ఫాస్ట్‌లా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తినడం వల్ల మీకు వేరే జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కలుగదు.

ఇప్పటి వరకూ తేనెని ఎలా తినాలో తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు ఎలా తినకూడదో తెలుసుకోవాలి. చాలా మందికి ఈ విషయాలు తెలియక.. తేనెలోని గుణాలను సరిగ్గా పొందలేరు. అవేంటో తెలుసుకోండి.

మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తేనెని వేడిచేయకూడదని. తేనెని వేడిచేస్తే అందులోని న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి. మీరు తేనెని వేడి చేసినప్పుడు అందులోని ఫ్రక్టోస్, సుక్రోజ్‌లో డిహైడ్రేట్ అయి హైడ్రోక్సీమిథైల్ఫురాల్‌లా మారతాయి. ఇవి బాడీలో టాక్సిసిటీని పెంచుతాయి. అంటే బాడీలో విషాన్ని పెంచినట్లే. ఇది అస్సలు మంచిది కాదు. ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే తేనెని వేడినీటిలో వేసుకుని తాగేవారు నీరు గోరువెచ్చగా మాత్రమే ఉండేలా చూసుకోండి.

ఆయుర్వేద పండితుల ప్రకారం నెయ్యితో తేనెని కలపడం అస్సలు మంచిది కాదు. అది కూడా రెండు కూడా సమాన మోతాదులో తీసుకోకూడదు. అవసరమనుకుంటే తేనె రెండు వంతులు నెయ్యి ఓ వంతు కలపొచ్చు. ఇది కూడా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.

అదే విధంగా.. ముల్లంగితో తేనెని కలపడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మనం సలాడ్స్ చేసినప్పుడు ముల్లంగి, తేనెని కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు. అదే విధంగా, ముల్లంగిని పాలతో కలిపి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ముల్లంగిలో ఎరిత్రోబిక్, మలోనిక్, మాలిక్, ఆక్సాలిక్ అనే యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి, దీనిని పాలు, తేనెతో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల ప్రకారం కొన్ని నాన్‌వెజ్ డిషెస్‌ని తేనెతో కలిపి తీసుకోవడం మంచిది. కానీ, కొన్నింటిని తేనెతో అస్సలు కలపకూడదని చెబుతున్నారు. చేపలు అలాంటి ఫుడ్స్‌ని తేనెతో కలిపి తీసుకోకూడదు. అయితే, ఈ కాంబినేషన్స్ గురించి సూచనలు మాత్రమే ఉన్నాయి. ఆధారాలు ఇంకా రాలేదు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆరోగ్య ప్రయోజనాల కోసం తేనెని సరైన విధంగా మాత్రం తినడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About amaravatinews

Check Also

మీ పాదాలు, చేతులు మాటి మాటికీ చల్లబడుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా

సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడటం కామన్. ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొందరికీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *