బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ మొదలుకాగానే నాగార్జున శుక్రవారం రాత్రి ఏం జరిగిందో చూద్దామంటూ మన టీవీ ప్లే చేశారు. అందులో హౌస్‌మేట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరూ తమ స్టోరీ గురించి తమ మాటల్లో చెప్పారు. అయితే నిఖిల్ స్టోరీ మాత్రం విన్నవాళ్లందరికీ కన్నీళ్లు తెప్పించేసింది. అసలు అక్కడున్న హౌస్‌మేట్స్ కూడా నిఖిల్ లవర్ మళ్లీ తన దగ్గరికి రావాలంటూ కోరుకున్నారు. అసలు నిఖిల్ ఏం చెప్పాడో చూద్దాం.
తనే నా భార్య
“నాకు తనే ఆ ఒక్కరు అని తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే తెలిసింది.. అంటే దానికి ముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ లవ్ అన్నీ మర్చిపోయేలా చేసిన లవ్ దొరికింది. తనకి కళ్లు ఒకటి మైనస్ 7, మరొకటి మైనస్ 6 ఉండేది అప్పుడు.. లైట్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్, స్పెట్స్, పోనీ టైల్ వేసుకుంది ఫస్ట్ టైమ్.. లైట్‌గా చెప్తా.. ఈ నవంబర్ 22కి తనతో లవ్ ఆరేళ్లు అవుతుంది.. విడిపోయారా విడిపోలేదా అని నన్ను అడిగితే నేను నా ఎమోషన్ నా బాండ్‌తో విడిపోలేను.. ఒక క్లారిటీ నాకే ఉంది ఏంటంటే ఫ్యూచర్‌లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా ఆ నిఖిల్ ఇంకెప్పుడూ రాలేడు.. ఆ ఒక్క వ్యక్తితోనే ఉంటాడు అలా.. కానీ యా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే.. అబ్బాయిలు ఒకసారి బ్యాక్ గ్రౌండ్ ఏం చూడం.. హార్ట్‌లో ఫిక్స్ అయితే అది ఫిక్స్.. తనే నా భార్య.. ఫిక్స్ అయిపోయాం.. ఏదో కొంచెం ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి సెలక్ట్ చేయడం కష్టమైపోయి సైలెంట్‌గా ఉన్నా అంతే.. కొంచెం స్పేస్ ఇద్దాం.. అన్నట్లు”
ఇద్దరూ వేరైపోయారనే ఫీలింగే
“నేను ఇప్పుడు కూడా ఏ స్టేజ్ ఎక్కినా ఏ షోకి వెళ్లినా నాకు తెలిసి ఈ జన్మకి సరిపోయేంత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి నాలో నా దగ్గర అంతే.. తనే ఇక లాస్ట్.. విడిపోయినప్పుడు కోపం వచ్చేసింది అన్నీ.. తప్పుంది నా సైడ్ కూడా నేను మంచోడ్ని అని చెప్పట్లేదు.. అర్థం చేసుకోవచ్చుగా అనే కోణంలో నాకు చాలా కోపం వచ్చేసింది.. హే తిను కాకపోతే ఇంకొకటి అది ఇదీ అనే ఆలోచనకి కూడా వెళ్లి ఆరేడు నెలలు అనుకున్నా కానీ కుదరలేదు.. మా అమ్మలాగే వచ్చింది.. నేను ఎన్నో సార్లు అంటా.. నిన్ను మా అమ్మా ఇద్దరూ ఒక్కటే అనుకున్నా ఇప్పుడు ఇద్దరైపోయారనే ఫీలింగ్ కూడా చాలా ఉండే..” అంటూ నిఖిల్ అన్నాడు.
పిచ్చిలేస్తే లేపుకెళ్తా
ఇంతలో అవినాష్ మాట్లాడుతూ “అమ్మ తర్వాత అమ్మ అంటున్నావ్.. ఎవరో ఒకరు అర్థం చేసుకుంటే అయిపోతుందిగా మరి..” అంటూ అడిగాడు. దీనికి నేను అర్థం చేసుకుంటా.. నేను ఇప్పుడు కూడా వదిలే లేదు.. ఈ షో తర్వాత నా ప్రయత్నం నేను చేస్తా.. నేను ఖచ్చితంగా వస్తా నాకు తెలుసు నువ్వు మళ్లా కోపపడతావు.. మళ్లా ఏదో ఏడుస్తావ్.. మాళ్లా నేను వెళ్తా మళ్లా వస్తా అలా ఎంతవరకూ జరిగితే అంత జరగని.. కోపపడితే పడు.. తిడితే తిట్టు.. కొట్టించుకోవడం కూడా జరిగింది.. కొట్టించుకుంటా ఇంకా.. కానీ ఒక్కటైతే పిచ్చి లేస్తే లేపుకెళ్తా.. ఐయామ్ సో సారీ.. నేను వస్తా.. ఈ షో నుంచి ఎప్పుడు బయటికి వస్తానో ఆ నెక్ట్ మూమెంట్ నీ ముందు నిల్చుంటా..
ఇంకో లక్కీ విషయం ఏంటంటే తనే నాకు ప్రపోజ్ చేసింది.. ఎంత ఇష్యూ అయినా నేను ఫేస్ చేస్తా.. నువ్వు నిల్చో చాలు పక్కన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.. ఏదైనా సరే నేను చూసుకుంటా.. నేనున్నంత వరకూ నీ వెనకాలే ఉంటా.. నేను చేసినవాటికి సారీ.. నాకు నువ్వు కావాలంతే.. ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు అమ్మ ఎలా క్షమించి దగ్గరికి తీసుకుంటుందో అలాగే తీసుకోవాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఐ లవ్యూ సో మచ్.. నువ్వు నాకు కావాలి.. అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇక ఈ స్టోరీ వింటున్నంత సేపు యష్మీ కూడా కాస్త ఎమోషనల్ అయింది. చివరిలో వాళ్లిద్దరూ ఖచ్చితంగా కలవాలి అన్నట్లు క్లాప్స్ కొట్టింది. మరి ఈ ఎపిసోడ్ చూసైనా సరే కావ్య మనసు కరుగుతుందా.. ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్లు కావ్య-నిఖిల్ మళ్లీ ఒక్కటవుతారా? వాళ్ల ఫ్యాన్స్ ముద్దుగా ‘కాని’ (కావ్య నిఖిల్)ని మళ్లీ కలిసి చూస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.