Narendra Modi: దీపావళికి స్పెషల్‌గా మోదీ లడ్డూ.. ఇందులో ఏం కలిపి తయారు చేశారో తెలుసా?

Narendra Modi: తమకు ఇష్టమైన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఇక వివిధ వర్గాల వారు తమకు ఉన్న ఇష్టాన్ని.. తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ వస్తుండటంతో ఈ స్వీట్ షాప్ యజమాని కొత్తగా ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించుకునేందుకు మోదీ లడ్డూ పేరుతో ఒక స్వీట్‌ను తయారు చేస్తున్నాడు. అయితే మోదీ అంటే తనకు ముందు నుంచీ అభిమానం ఉందని.. అందుకే ఆయన మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి.. ఏటా దీపావళికి ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికకావడంతో ఈసారి మరింత స్పెషల్‌గా మోదీ లడ్డూను తయారు చేస్తున్నట్లు ఆ స్వీట్ షాప్ ఓనర్ వెల్లడించాడు.

బీహార్‌కు చెందిన స్వీట్ షాప్ యజమాని సంజీవ్‌ శర్మకు ముందు నుంచీ మోదీ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే 2014లో తొలిసారి ప్రధానిగా మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్‌ లడ్డూలకు “మోదీ లడ్డూ” అనే పేరును పెట్టాడు. దీంతో సంజీవ్ శర్మ విక్రయించిన ఈ మోదీ లడ్డూలకు మంచి గిరాకీ వచ్చింది. అంతేకాకుండా అతడికి మంచి పేరు కూడా వచ్చింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి గౌరవంగా.. మోదీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నాడు. అందుకే ఈ దీపావళి సందర్భంగా తయారు చేసే మోదీ లడ్డూల్లో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు సంజీవ్ శర్మ వెల్లడించాడు.

About amaravatinews

Check Also

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *