Donations: అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువ.. రూ.కోటి అందజేసిన మాజీ ఎంపీ

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో 2019కి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పేదలకు రూ.5లకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. మర్నాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన వస్తోంది. పలువురు ముందుకొచ్చి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా, అన్న క్యాంటీన్ల నిర్వహణకు మాజీ ఎంపీ, లైలా గ్రూప్‌ ఛైర్మన్‌ డా.గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ (ట్విట్టర్)‌లో వెల్లడించారు. ఆయన ఉదారమైన సహకారానికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ‘గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు అందరూ భాగస్వాములవుతున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు మాజీ ఎంపీ గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు.. ఆయన సహకారాన్ని అభినందిస్తున్నాం’ అని లోకేశ్‌ తెలిపారు.

అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని సూచించారు. అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరిన సీఎం.. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించినట్టు తెలిపారు. ఎస్‌బీఐ అకౌంట్ నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు.

ఇక, ప్రభుత్వానికి నేరుగా విరాళాలు అందించలేని వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా లేదా చెక్కులను అన్నక్యాంటీన్లకు సంబంధించిన ఖాతాలో జమచేయొచ్చు. అయితే, అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు రూ.96 ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.ఈ క్యాంటీన్లలో ఆహారం తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం, దాతలు భరిస్తారు. అన్న క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి రూ.కోటి విరాళం అందజేశారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సైతం రూ.కోటి విరాళాన్ని ఇవ్వగా.. ఓ వ్యక్తి తన మూడెకరాల భూమిని ఇవ్వడం విశేషం.

About amaravatinews

Check Also

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *