జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న గ్రామ పంచాయతీ.. ఏకంగా అవార్డు సొంతం.. ఎందుకంటే..?

బొమ్మసముద్రం కు జాతీయ అవార్డు లభించడంతో పంచాయతీలోని తిరువణంపల్లి, బొమ్మ సముద్రం గ్రామాల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. ఐరాల మండలం బొమ్మ సముద్రం పంచాయతీ బెస్ట్ హెల్త్ విలేజ్ గా జాతీయ అవార్డు పొందింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ రఘునాథ్, అధికారులతో కలిసి అవార్డు అందుకున్నారు.

జిల్లా నుంచి డిల్లీకి వెళ్ళన జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు, ఐరాల మండలం ఎంపీడీవో ధనలక్ష్మి తో కలిసి వెళ్ళిన గ్రామ సర్పంచ్ రంగనాథ్ రూ. కోటి నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పంచాయితీ కి ఈ గౌరవం దక్కడానికి ప్రధాన కారణం ఏడాది కాలంలో ప్రసూతి మరణాలు, మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకపోవడమే. అలాగే మైనర్ బాలికలకు సంబంధించిన ఎలాంటి కేసులు నమోదు కాకపోవడమే ఈ గుర్తింపు దక్కింది.

ఆరోగ్య విభాగంలో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైన బొమ్మ సముద్రం పంచాయతీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అరుదైన పురస్కారాన్ని అందించారు. రూ.కోటి నగదును పంచాయతీ ఖాతాకు జమ చేశారు. రాష్ట్రంలోని నాలుగు పంచాయతీలకు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కగా, బెస్ట్ హెల్త్ విలేజ్ గా బొమ్మ సముద్రం నిలిచింది. గత ఏడాది కాలంలో బాల్య వివాహాలు జరగకపోవడం, మైనర్ బాలికలపై ఎలాంటి దాడులు జరగక పోవడంతోపాటు ఆరోగ్యపరంగా ఉత్తమ సేవలు పొందిన పంచాయితీగా దేశ గౌరవాన్ని సొంతం చేసుకుంది.

బొమ్మసముద్రం కు జాతీయ అవార్డు లభించడంతో పంచాయతీలోని తిరువణంపల్లి, బొమ్మ సముద్రం గ్రామాల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఆరోగ్య విభాగంలో జాతీయస్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న బొమ్మ సముద్రం భవిష్యత్తులో పారిశుధ్యంతోపాటు మిగతా విభాగాల్లోనూ అవార్డు పొందేందుకు ప్రయత్నిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. కాణిపాకం పీహెచ్సీ పరిధిలోని బొమ్మసముద్రం ఆరోగ్యకర పంచాయతీ గా నిలవడం పట్ల వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

About Kadam

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *