BSNL Sarvatra Technology : టెలికాం ఇండస్ట్రీలో BSNL దూసుకుపోతోంది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. సుదూర ప్రాంతాల వినియోగదారులకు కూడా హోమ్ ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తోంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం, ఫైబర్ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఈ టెలికం ప్రొవైడర్లకు పోటీగా BSNL ‘సర్వత్ర’ టెక్నాలజీ (Sarvatra Technology) పేరిట మరో టెలికార రంగంలో మరో విప్లవం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది బీఎస్ఎన్ఎల్ (BSNL). సర్వత్ర అనే పేరుతో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురానుంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం, ఫైబర్ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఈ టెలికం ప్రొవైడర్లకు పోటీగా BSNL సర్వత్ర..టెలికాం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. BSNL కస్టమర్లు కొత్త టెక్నాలజీకి దూరంగా ఉన్నప్పటికీ వారి హోమ్ ఫైబర్ కనెక్షన్ల ద్వారా ఈ హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. ఈ ప్రాజెక్టు ట్రయల్ దశ ఇప్పటికే పూర్తయింది. కేరళతో సహా వివిధ ప్రాంతాల్లో ఈ కొత్త టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాలకు సైతం ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించడమే ఈ బీఎస్‌ఎన్‌ఎల్ Sarvatra Technology ఉద్దేశం.
BSNL సర్వత్ర టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే..?
BSNL Sarvatra Technology అనేది ఫైబర్ టు ది హోమ్ (FTTH) టెక్నాలజీతో వస్తుంది. ఇది ఇప్పటికే ఇల్లు, ఆఫీసుల్లో FTTH కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులకు ఇతర ప్రదేశాల నుంచి ఇంటర్నెట్ యాక్సెస్‌కు అనుతిస్తుంది. ఈఫీచర్‌ను వినియోగించుకోవాలంటే.. తప్పనిసరిగా సర్వత్ర పథకం కింద నమోదు చేసుకోవాలి. సర్వత్రా పోర్టల్ వర్చువల్ టవర్ లాగా పనిచేస్తుంది.. కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.