బడ్జెట్‌లో చిన్నారుల కోసం కేంద్రం కొత్త స్కీమ్..

NPS Vatsalya Tax Benefits: 2024 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం NPS వాత్సల్య పథకం తీసుకొచ్చారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. పిల్లల భవిష్యత్ కోసం ముందు నుంచే పెట్టుబడుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీం తీసుకొచ్చారు. భారత ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలన్న సంకల్పంతో 2004లో కేంద్రం.. NPS పథకాన్ని తీసుకొచ్చింది.

ఈ పథకం ముఖ్యంగా పన్ను ప్రయోజనాలతో పాటు.. దీర్ఘకాలిక పెట్టుబడి స్కీంగా బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్తృతం చేస్తూ.. మైనర్లకు కూడా ఈ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుకన్య సమృద్ధి యోజన సహా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాలకు ఇప్పుడు అదనంగా మరొకటి చేరిందని చెప్పొచ్చు.

>> సాధారణంగా NPS లో టైర్- 1, టైర్- 2 అకౌంట్లు ఉంటాయి. టైర్ – 1 అనేది ప్రాథమిక పెన్షన్ ఖాతా. దీంట్లో చేరిన సమయంలో ఉపసంహరణలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్ -2 స్వచ్ఛంద పొదుపు పథకం వంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50 వేల పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇంకా సెక్షన్ 80c కింద రూ. 1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.
రిటైర్మెంట్ తర్వాత NPS నిధి నుంచి ఒక్కసారే 60 శాతం వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ పథకాల్ని కొనుగోలు చేయాలి. దీనితోనే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందొచ్చు.

NPS బెనిఫిట్స్..

ఎన్‌పీఎస్ వాత్సల్య వల్ల ముందుగానే పెట్టుబడులు ప్రారంభించొచ్చు. ఇంకా దీంట్లో చక్రవడ్డీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. మైనర్లుగా ఉన్నప్పుడే NPS అకౌంట్ తెరవడం వల్ల రిటైర్మెంట్ కల్లా పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్ వల్ల చిన్నతనం నుంచే తమ పిల్లలకు పొదుపు అలవాటు చేసేందుకు వీలుపడుతుంది. ఇంకా దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల కలిగే బెనిఫిట్స్ వారికి తెలియజేయొచ్చు.

నెలకు రూ. 500 లేదా సంవత్సరానికి రూ. 6 వేలు ఇలా అతి తక్కువ మొత్తంలో పెట్టుబడితో.. ఈ స్కీంలో enps- NSDL వె‌బ్‌సైట్ లేదా బ్యాంకులో కానీ ఈ అకౌంట్ తెరవొచ్చు. ఈ పథకంలో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంది. ఇంకా రిటైర్మెంట్‌లో వచ్చే మొత్తంపైనా ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *